Advertisement
TDP Ads

జగన్ ఓవరాక్షన్.. పవన్ రియాక్షన్!

Mon 22nd Jul 2024 07:19 PM
jagan  జగన్ ఓవరాక్షన్.. పవన్ రియాక్షన్!
Jagan Over Action - Pawan reaction! జగన్ ఓవరాక్షన్.. పవన్ రియాక్షన్!
Advertisement

మౌనం వీడిన పవన్.. జగన్‌కు గట్టిగానే!

ఒకటా రెండా.. నెలన్నరపాటు ఏం జరుగుతున్నా, వైసీపీ ఏం చేస్తున్నా సరే సైలెంట్‌గా ఉన్న సేనాని ఒక్కసారిగా జూలు విదిల్చారు..! ఇన్ని రోజులుగా వైసీపీ ఆడుతున్న ఆటలకు చెక్ పెట్టి.. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న యాక్షన్.. అంతకుమించి ఓవరాక్షన్‌కు గట్టిగానే రియాక్షన్ ఇచ్చేశారు..! యాక్షన్‌కు ఇదిగో ఇలా ఉంటుంది రియాక్షన్ అంటూ గట్టిగానే ఇచ్చిపడేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..! ఇన్ని రోజుల మౌనానికి ఫుల్‌స్టాప్ పెట్టేసి పవన్ చేసిన ఈ కామెంట్స్‌ సోషల్ మీడియా వేదికగా ఓ రేంజిలో వైరల్ అవుతున్నాయి. వారెవ్వా.. ఇదీ డిప్యూటీ అంటే అని అభిమానులు, కార్యకర్తలు ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నారు.

అసలేం జరిగింది..!

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలిచిన రోజు నుంచి నేటి వరకూ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా విఫలం అయ్యాయన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ. ఇప్పటికే పలుమార్లు మీడియా ముందుకొచ్చి పెద్ద రాద్ధాంతం చేసిన వైసీపీ నేతలు, వైఎస్ జగన్.. ఎల్లుండి ఢిల్లీ వేదికగా ధర్నా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సోమవారం నాడు అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సేవ్ డెమొక్రసీ అంటూ నల్లకండువాలు ధరించి ఫ్లకార్డులతో నిరసన తెలియజేశారు. అసెంబ్లీ బయట పోలీసులు అడ్డుకోగా.. మధు సూధన్‌రావ్ గుర్తుపెట్టుకో అంటూ హెచ్చరించిన జగన్ నానా యాగీ చేశారు. ఇక అసెంబ్లీ లోపలికి వచ్చి గవర్నర్ ప్రసంగానికి కూడా అడ్డుపడి.. ఏపీలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను ఆపాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలా ఫలితాలు మొదటి రోజు నుంచి నేటి వరకూ వైసీపీ చేస్తున్న ప్రతి ఒక్క విషయానికి కౌంటర్‌గా పవన్ స్పందించారు.

ఇచ్చిపడేసిన సేనాని..!

తొలిరోజు అసెంబ్లీ సమావేశాల అనంతరం.. ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా రాకపోయినా జగన్‌కు ఇంకా తత్వం బోధపడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటి..? అని మండిపడ్డారు. అంటే.. శాంతి భద్రతలు విఫలం అయ్యాయనే వ్యాఖ్యలకు ఇదే కౌంటర్ ఏమో..! అంతేకాదు వినుకొండ హత్య విషయాన్ని డైరెక్టుగా ప్రస్తావించకుండానే మాట్లాడిన సేనాని.. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెబుతూ కుట్రలకు తెరలేపుతున్నారని కన్నెర్రజేశారు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలకు ఒక్క మాటలే పవన్ ఇలా రియాక్ట్ అయ్యారన్న మాట.

పోలీసులతో గొడవేంటి..?

అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ముందు పోలీసులతో జగన్ గొడవ పడటమేంటి..? ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇక.. గవర్నర్ ప్రసంగానికి మాజీ సీఎం అడ్డు తగలడమే కాకుండా, వైసీపీ సభ్యులను రెచ్చగొట్టడం అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతానని భ్రమ నుంచి ప్రజలు బయట పడేసినా జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో? అని సెటైర్లేశారు సేనాని. ఇక చివరిగా రాష్ట్రాభివృద్ధికి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సీఎం చంద్రబాబుకు తాను, తన పార్టీ వందకు వంద శాతం సహకరిస్తుందని స్పష్టం చేశారు. చూశారుగా.. పవన్ స్పందించు.. పవన్ స్పందించు అంటూ ఇన్నాళ్లు నానా రచ్చ చేసిన వైసీపీ కార్యకర్తలు, సొంత పార్టీ అభిమానుల ప్రశ్నలు, సందేహాలు అన్నింటికి జవాబు దొరికినట్టే కదా..!!

Jagan Over Action - Pawan reaction!:

Jagan vs Pawan Kalyan

Tags:   JAGAN
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement