ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. అన్నట్టుగా గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ పై నిర్మాత దిల్ రాజు గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పష్టతనిచ్చారు. ఎప్పటి నుంచో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఫైనల్ గా గేమ్ ఛేంజర్ తో క్రిస్మస్ కి కలుద్దామంటూ మెగా ఫ్యాన్స్ కి చల్లని కబురు అందించారు. కానీ పర్టిక్యులర్ గా విడుదల తేదీ ఇవ్వలేదు.
తాజా సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ విడుదల డిసెంబర్ 20 అంటున్నారు. మరి డిసెంబర్ 20 అంటే నిజంగా గేమ్ ఛేంజర్ విడుదల పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మేకర్స్ డేట్ ఫిక్స్ చేస్తున్నట్టుగా ఉన్నారు. డిసెంబర్ 20 శుక్రవారం, ఆ తర్వాత శని, ఆదివారం వీకెండ్.
Dec 20 Friday
Dec 21 Saturday
Dec 22 Sunday
Dec 24 Christmas Eve
Dec 25 Christmas
Dec 26 holidays continue
Dec 28 Saturday
Dec 29 Sunday
Jan 1st New Year Day
ఇదన్నమాట గేమ్ ఛేంజర్ కి ప్లస్ అవ్వబోతున్న హాలిడేస్. సో సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్, అలాగే పాజిటివ్ రివ్యూస్ వచ్చినా కలెక్షన్స్ కుమ్మేస్తాయి అనేది వేరే చెప్పక్కర్లేదు అనుకుంటా. అందుకే అనేది గేమ్ ఛేంజర్ పర్ఫెక్ట్ డేట్ పట్టింది అని.