ఏపీ రాజకీయాల్లో పాదయాత్ర అనేది వైఎస్సార్ మొదలు పెట్టారు. ఆ తర్వాత జగన్ దానిని అనుసరించాడు. లోకేష్ కూడా యువగళం తో పాదయాత్ర చేసాడు. అలాగే తెలంగాణాలో కూడా భట్టి విక్రమార్క కాంగ్రెస్ గెలవాలని పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యారు. అందుకే ఇప్పుడొక స్టార్ హీరో పాదయాత్ర చెయ్యాలని డిసైడ్ అయినట్లుగా కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నారు.
ఆయనే హీరో విజయ్. తమిళనాట తమిళగ వెట్రి కళగం పార్టీ పెట్టి గెలుపే లక్ష్యంగా పని మొదలు పెట్టిన విజయ్ మధ్య మధ్యలో సినిమా షూటింగ్స్, ఖాళీ సమయాల్లో అభిమానులను కలవడం, పేద విద్యార్థులతో మీటింగ్స్ పెట్టడం వంటి వాటితో విజయ్ రాజకీయంగా యాక్టీవ్ అవుతున్నాడు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ముందుగా కొన్ని జిల్లాలో పార్టీ సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు విజయ్ కసరత్తులు చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. బీజేపీ, DMK లకు షాకిస్తూ విజయ్ అన్నాడీఎంకే తో పొత్తు పెత్తుకోవడమా.. లేదంటే సింగిల్ గా పోటీ చెయ్యడమా అనే విషయాలను పార్టీ వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
ముందుగా విజయ్ పార్టీ తమిళనాట కొన్ని జిల్లాలో ర్యాలీలు నిర్వహించాక.. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అవుతుందట. అది కూడా పాదయాత్ర చేస్తూ తమిళ ప్రజలతో విజయ్ మమేకమైపోవడాలని, అప్పుడే తన పార్టీ బలంగా ప్రజల్లోకి వెళుతుంది అని విజయ్ ప్లాన్ చేస్తున్నారట.100 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ విజయ్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఉండబోతుందట.
అలాగే మధ్య మధ్యలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత తేవాలని విజయ్ పార్టీ నేతలతో కలిసి ప్లాన్ చేస్తున్నాడట.