శంకర్-కమల్ హాసన్ మరోసారి భారతీయుడు ఫీల్ తీసుకొస్తారు, భారతీయుడు సక్సెస్ ని రిపీట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసారు. కానీ ఇండియన్ 2 తో వీరు అని వర్గాల ఆడియన్స్ ని నిరాశపరిచారు. భారీ అంచనాల నడుమ జులై 12 న విడుదలై ఇండియా 2 కి మొదటి రోజు మొదటి షో కె నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో నిర్మాతలు భారీగా లాస్ అయ్యారు.
ఇండియన్ 2 కి రెండో రోజు నుంచే కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. అయితే శంకర్-కమల్ హాసన్ కలయికపై ఉన్న అంచనాలతో ఇండియన్ 2 చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల డిజిటల్ హక్కులను భారీ రేటుతో దక్కించుకుంది. తమిళనాట అన్ని సినిమాల కన్నా ఇండియా 2 కి నెట్ ఫ్లిక్స్ ఎక్కువ ధర కోడ్ చేసినట్లుగా చెప్పుకున్నారు.
అది కూడా సినిమా థియేటర్స్ లో విడుదలైన రెండు నెలల గ్యాప్ లో స్ట్రీమింగ్ అయ్యేలా మేకర్ ఒప్పందం చేసుకున్నారు. తీరా సినిమాకి థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ రావడం.. చాలా థియేటర్స్ లో ఆడియన్స్ లేక ఇండియన్ 2 ని ఎత్తెయ్యడంతో ఇప్పుడు భారతీయుడు 2 ఓటీటీ డేట్ విషయంలో మేకర్స్ పునరాలోచనలో పడ్డారని వినికిడి.
అందుకే రెండు నెలల ఒప్పందాన్ని పక్కనబెట్టి మూడు, నాలుగు వారాల గ్యాప్ లోనే ఓటీటీ స్ట్రీమింగ్ చెయ్యాలి అని అనుకుంటున్నారట. ఆ లెక్కన ఆగష్టు 15 న భారతీయుడు 2 ని నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.