కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ - లోకనాయకుడు కమల్ హాసన్ తో చాలా భారీగా ఇండియన్ 2 చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రావడమే కాదు.. గొప్పగా ఇండియన్ 2 పూజ కార్యకమాలతో మొదలు పెట్టిన టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేసారు. అప్పుడు దిల్ రాజు విషయం పెద్ద సెన్సేషన్ అయ్యింది.
ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ లోకి లైకా వారు వచ్చారు. ఇండియన్ 2 షూటింగ్ స్పాట్ లో జరిగిన ప్రమాదం కారణంగా కొన్ని రోజులు ఇండియన్ 2 షూటింగ్ ఆగిపోయింది. హమ్మయ్య దిల్ రాజు సేవ్ అయ్యారు అనుకున్నారు. ఆ తర్వాత శంకర్ తో దిల్ రాజు గేమ్ ఛేంజర్ మూవీ మొదలు పెట్టారు. ఆ షూటింగ్ జరుగుతుండగా.. లైకా వారు ఇండియన్ 2 షూటింగ్ అయ్యి రిలీజ్ అయ్యాకే మిగతా ప్రాజెక్ట్స్ చేసుకోవాలంటూ కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి శంకర్ ని ఇరకాటంలో పెట్టారు.
అప్పటి నుంచి ఇండియన్ 2-గేమ్ ఛేంజర్ రెండు షూటింగ్స్ పారలల్ గా చేస్తూ వచ్చారు శంకర్. ఇక ఇండియన్ 2 రిలీజ్ అయ్యింది ఆ రిజల్ట్ చూసి నిర్మాతలు బేర్ మన్నారు. హమ్మయ్య దిల్ రాజు ఆ ప్రోజెక్టు నుంచి బయటికొచ్చి మంచి పని చేసారనుకున్నారు. అది ఓకె ఇప్పుడు రాజు గారు గేమ్ ఛేంజర్ తో హిట్ కొడతారో, లేదో అనే క్యూరియాసిటీ అందరిలో మొదలైంది.
అక్కడ ఇండియన్ 2 నుంచి ఎలాగో లక్కీగా తప్పించుకున్న దిల్ రాజు ఇక్కడ గేమ్ ఛేంజర్ విషయంలో ఏం చేస్తారో అని అందరూ మాట్లాడుకుంటున్నారు.