కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ శుక్రవారం రాయన్ మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. తమిళంలోనే కాదు తెలుగులోనూ రాయన్ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తుంది ధనుష్ అండ్ టీమ్. డైరెక్టర్ కమ్ హీరోగా ధనుష్ రాయన్ చిత్రం తెరకెక్కింది.
తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ ని సదరు యాంకర్ మీరు గనక మల్టీస్టారర్ చెయ్యాలనుకుంటే తెలుగు హీరోలైన ఎన్టీఆర్ తో చేస్తారా.. లేదంటే రామ్ చరణ్, అల్లు అర్జున్ లలో ఎవరినైనా చూజ్ చేసుకుంటారా అని అడగగా.. దానికి ధనుష్ నేను తారక్ అన్నతో కలిసి సినిమా చేస్తాను అన్నారు. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
ఇక ధనుష్ ఐ లవ్ సినిమా, బట్ ఐ లవ్ పవన్ కళ్యాణ్ సర్ అంటూ అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కూడా బుట్టలో వేసేసారు. అయినప్పటికీ మిగతా స్టార్స్ అభిమానులను తిట్టుకోవద్దు అంటూ ధనుష్ వారిని కూడా కూల్ చేసే ప్రయత్నం చెయ్యడం అక్కడున్న అందరిని ఇంప్రెస్స్ చేసింది.