అవును.. మీరు వింటున్నది నిజమే కాంగ్రెస్ - వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయ్! ఇక ఏమున్నా సరే కలిసి మెలిసి మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో ముందుకు వెళ్లాలని ఫిక్స్ అయ్యాయి. ఇందుకు ఆదివారం నాడు జరిగిన అఖిలపక్ష సమావేశమే ప్రత్యక్ష సాక్ష్యం. ఇదంతా.. స్వయంగా కాంగ్రెస్ కీలక నేత జైరామ్ రమేష్ చెప్పిన మాట. దీంతో అసలు ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోంది..? అంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా చర్చ నడుస్తోంది.
ఎలా.. అదే ఎలాగా..?
కాంగ్రెస్ అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అస్సలు పడదు. నాడు వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వకపోవడం.. పార్టీని ఎదిరించి బయటికి వచ్చి యాత్ర చేసి అనంతరం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఇక్కడే హస్తం పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాడు అడ్రెస్స్ లేకుండా పోయిన ఈ పార్టీ వైఎస్ షర్మిల రాష్ట్ర అధ్యక్షురాలు ఐనా ఇప్పటికీ ఒక్కశాతం కూడా కోలేకోలేక పోతోంది. ఐతే.. వైసీపీని మాత్రం 2024 ఎన్నికల్లో చాలా చోట్ల హస్తం.. ఫ్యాన్ రెక్కలు విరిచింది. ఐతే.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు అంటారు కదా.. ఈ మాటనే కాంగ్రెస్ - వైసీపీ పార్టీలు నిజం చేస్తూ ఉన్నట్లు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
హోదా కలుపుతోంది ఇద్దరినీ..!
ఆదివారం నాడు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా.. వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం జరిగింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ హోదా ప్రస్తావన, డిమాండ్ చేశారు. మరోవైపు.. జేడీయూ కూడా బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కేంద్రాన్ని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. సమావేశంలో భాగంగా మళ్ళీ ప్యాకేజీ ప్రస్తావన తెచ్చింది జేడీయూ. దీన్ని బట్టి చూస్తే.. రెండు పార్టీల మధ్య మ్యూచువల్ అండర్ స్టాండింగ్ పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీకి కూడా చిన్న పార్టీలు మొదలు జాతీయ స్థాయిలో సపోర్ట్ ఏంతో అవసరం. అలా హోదా విషయంలో రెండు పార్టీలు కలయికకు బీజం పడింది.
ఇప్పటి వరకూ ఒక లెక్క..!
వాస్తవానికి వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి నిన్న, మొన్నటివరకు బీజేపీకి కావాల్సినప్పుడల్లా మద్దతు ఇస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా రాజ్యసభలో మద్దతు కావాలంటే ఏపఈకి ప్రత్యేక హోదా ఇవ్వండి.. ప్రధాని మోదీతో వైసీపీ అధ్యక్షుడు జగన్ తేల్చి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐతే ఇంత జరుగుతున్నా ఆల్ పార్టీ మీటింగ్ లో కానీ.. మీడియా ముఖంగా.. టీడీపీ డిమాండ్ చేయకపోవడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండి కూడా ఎందుకో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. మొత్తానికి చూస్తే.. కాంగ్రెస్ పార్టీ వైసీపీ.. వైసీపీకి కాంగ్రెస్ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు..! ఇది ఎంతవరకు వెళ్తుందో..! ఐనా ఇప్పటిదాకా ఎందుకు రేపొద్దున ఢిల్లీ వేదికగా జగన్ చేస్తున్న ధర్నాతో.. ఎవరికి ఎవరు..? అనేది తేలిపోనున్నది. ఏం జరుగుతుందో చూడాలి మరి.
--