రామ్ చరణ్ గేమ్ చేంజర్ ని ఎలాగో వదిలించుకుని తన నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. అంబానీ ఇంట పెళ్లి వేడుకకు హాజరై అక్కడి నుంచి అటే లండన్ వెళ్ళిపోయారు. భార్య ఉపాసన, కుమార్తె క్లింకార తో ఎంజాయ్ చెయ్యడమే కాదు, అక్కడ మేడమ్ టుస్సాడ్స్ ఫోటో షూట్ లో బిజీగా వున్నాడు.
అయితే రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు తో చెయ్యబోయే RC 16(పెద్ది వర్కింగ్ టైటిల్) కేరెక్టర్ కోసం లుక్ మార్చే పనిలో ఉన్నారట. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది కోసం గెడ్డం, ఇంకా మీసం పెంచుతూ.. అనుకున్న గెటప్ వస్తే బుచ్చి బాబు వెంటనే సినిమాని పట్టాలెక్కించేందుకు సిద్దమవుతాడట.
మొన్నామధ్యన ఆగస్టు నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకి వెళుతుంది అన్నప్పటికీ.. ఇప్పుడు RC16 సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్లే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి రామ్ చరణ్ ఈ చిత్రంలో డిఫరెంట్ గా సిక్స్ ప్యాక్ లుక్ లో ఆటగాడిగా కనిస్తాడని టాక్. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కీ రోల్ లో కన్నడ శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు.