పాపం వైసీపీ పార్టీ తరుపున ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబడి దారుణంగా ఓడిపోయిన చాలామంది తమ ఓటమికి కారణం జగన్ అని నమ్ముతున్నారు. మరికొందరు జగన్ మంచి చేసినా ఓడిపోయామనే భ్రమలోనే ఉన్నారు. ఇంకొందరు జగన్ గురించి తెలిసి కూడా భజన చేస్తున్నారు. చాలామంది అసలు తామెందుకు ఓడిపోయామో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు.
అందులో కొందరు తమ ఓటమికి గల కారణాలు వెతుక్కుంటున్నారు. అందులో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఒకరు. రీసెంట్ గా యాంకర్ జాఫర్ తో కలిసి తానెందుకు ఓడిపోయాడో అనే విషయాన్ని తెలుసుకునేందుకు మార్గాని భరత్ జనం మద్యలోకి వెళ్ళాడు. ఆ నియోజకవర్గ ప్రజలంతా ఒకటే మాట, ఒకటే తిట్లు. వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు వెయ్యలేదు, అభివృద్ధి చెయ్యలేదు.
ముఖ్యంగా వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకోవడమే ఆ పార్టీ పతనానికి ప్రధాన కారణం. ప్రజలను పట్టించుకోలేదు, ప్రభుత్వ ఉద్యోగులను వేధించడం, చాలా దారుణంగా చేసారు పరిపాలన, ఒకటేమిటి వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలు, ఓటు బ్యాంకు గురించి అలోచించి మిగతా రాష్ట్ర అభివృద్ధి గాలికి వదిలేసింది అంటూ మార్గాని భరత్ ముందే ప్రజలు వైసీపీ పార్టీ ఓటమికి కారణాలను వివరించారు. ఇది విన్న మార్గాని ఇకపై ఏం చేస్తాడో అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.