బిగ్ బాస్ సీజన్ 8 ఆగస్టు చివరి వారం నుంచి కానీ లేదంటే సెప్టెంబర్ మొదటి వారం నుంచి కానీ మొదలు కాబోతుంది. అయితే గత ఐదు సీజన్ కి హోస్ట్ గా వస్తున్న కింగ్ నాగార్జున హౌస్ లోని కంటెస్టెంట్స్ ని నవ్విస్తూ, కవ్విస్తూ.. క్లాస్ తీసుకుంటూ.. పొగుడుతూ బుల్లితెర ప్రేక్షకులు మెచ్చే వ్యాఖ్యాతగా మన్ననలు పొందారు.
మరి ఈ సీజన్ కి కింగ్ నాగార్జున ప్లేస్ లో టాలీవుడ్ టాప్ హీరో ఒకరు సీజన్ 8 కి హోస్ట్ గా వస్తారు.. అందులో బాలయ్య, సిద్దు జొన్నలగడ్డ, రానా పేర్లు గట్టిగా వినిపించినా.. తాజాగా నాగార్జున బిగ్ బాస్ సీజన్ 8 కి తానే హోస్ట్ అని చెప్పడమే కాదు.. బిగ్ బాస్ 8 లోగో తో పాటుగా వచ్చేసారు.
సీజన్ 8 లోగో కాస్త డిఫరెంట్ గా కనిపించింది. ఆ ప్రోమో చూడగానే.. సీజన్ 8 కోసం వెయిటింగ్ అంటూ బుల్లితెర బిగ్ బాస్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.