Advertisementt

డబుల్ ఇస్మార్ట్ vs మిస్టర్ బచ్చన్

Sun 21st Jul 2024 04:09 PM
ravi teja  డబుల్ ఇస్మార్ట్ vs మిస్టర్ బచ్చన్
Double iSmart vs Mister Bachchan డబుల్ ఇస్మార్ట్ vs మిస్టర్ బచ్చన్
Advertisement
Ads by CJ

ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే రోజున బాక్సాఫీసు జాతరకు దర్శకనిర్మాతలు రెడీ.. మీరు రెడీనా అంటూ ప్రేక్షకులకు ఛాలెంజ్ విసురుతున్నారు హీరోలు. ఇప్పటికే ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఆయ్ ఆగష్టు 15 విడుదల అన్నారు. ఇక రామ్-పూరి జగన్నాథ్ లు డబుల్ ఇస్మార్ట్ ని ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే కి విడుదల అంటూ ఎప్పుడో డేట్ మార్చారు. 

ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ మిస్టర్ బచ్చన్ ప్రేక్షకులని అల్టిమేట్ ఎంటర్ టైన్మెంట్ అందించడానికి రెడీగా ఉంది. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రోజున ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఆగస్ట్ 19న (సోమవారం) రక్షా బంధన్ హాలీడేతో 5 రోజుల లాంగ్ వీకెండ్‌ను ఉపయోగించుకుంటుంది. ఈ సినిమా ప్రీమియర్ షోలు ఆగస్ట్ 14న జరగనున్నాయి. అంతో మేకర్స్ పోస్టర్ తో సహా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 

మిస్టర్ బచ్చన్ రిలీజ్ డేట్ పోస్టర్ లో రవితేజ స్లిక్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఈ మధ్యనే  ఫస్ట్ సింగిల్ సితార్‌ను విడుదల చేసారు. ఈ పాట క్లాసికల్, లవ్లీ కంపోజిషన్, బ్యూటీఫుల్ లోకేషన్స్, రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ మధ్య స్టీమీ రొమాన్స్ తో విశేషంగా అలరించి చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. 

మరి ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే కి రవితేజ మిస్టర్ బచ్చన్ vs రామ్ డబుల్ ఇస్మార్ట్ తో బాక్సాఫీసు దగ్గర బిగ్ ఫైట్ అయితే చూడబోతున్నామన్నమాట. గెలిచేది ఎవరో.. ఓడేది ఎవరో అనేది కూడా అప్పుడే తెలుస్తుంది. 

Double iSmart vs Mister Bachchan:

Ravi Teja vs Hero Ram

Tags:   RAVI TEJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ