Advertisementt

నటి పెళ్లికి కూతురు ఆటంకం

Sun 21st Jul 2024 03:58 PM
sushmita sen  నటి పెళ్లికి కూతురు ఆటంకం
Sushmita Sen reveals her wedding plans నటి పెళ్లికి కూతురు ఆటంకం
Advertisement
Ads by CJ

బాలీవుడ్ భామ సుష్మిత సేన్ కొన్నాళ్లుగా సింగిల్ గానే కనిపిస్తుంది. కొన్నేళ్లపాటు  మోడల్ రొహ్మన్ షా తో డేటింగ్ చేసిన సుష్మిత సేన్ అతన్ని వివాహం కూడా చేసుకుంటుంది అనే ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. కట్ చేస్తే సుష్మిత సేన్ ఐపీఎల్ రూపకర్త లలిత్ మోడీతో వ్యవహారం నడిపింది.

లలిత్ మోడీ-సుష్మిత సేన్ లు వివాహం చేసుకుంటారని అనుకున్నారు. కానీ అది కూడా సుష్మిత విషయంలో బెడిసికొట్టింది. ప్రస్తుతం రొహ్మన్ షా తోనే అప్పుడప్పుడు కనిపిస్తున్న సుష్మిత సేన్.. పెళ్ళికి తన కూతురే అడ్డుపడుతుంది, నేను పెళ్లి చేసుకుంటాను అంటే నా పిల్లలు ఒప్పుకోరంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

మూడేళ్ళుగా సింగిల్ గానే ఉంటున్నాను, ప్రస్తుతం నా లైఫ్ లో ఏ మగాడు లేడు, నేను పెళ్లి చేసుకుంటాను అన్నా నా పిల్లలు ఒప్పుకోరు. నా పెద్ద కూతురు అయితే నీకు వెళ్లేందుకు. సింగిల్ గా ఉంటూ నీ లైఫ్ ని నీ ఇష్టమొచ్చినట్టుగా లీడ్ చెయ్యొచ్చు అని సలహా ఇస్తుంది. ఇక ప్రస్తుతం నాకు ప్రేమ వెంట పరిగెత్తాలని లేదు.

ప్రేమ పై ఆలోచన, ఆసక్తి రెండూ లేవు. ఐదేళ్లు ఒకరితో రిలేషన్ లో ఉన్నాను. కానీ ఇప్పుడు లవ్ కి బ్రేకివ్వడం బాగుంది.. అంటూ సుష్మిత సేన్ ప్రెజెంట్ తాను ఒంటరే .. నా లైఫ్ లో పెళ్లి, ప్రేమ ఏమి లేవని తేల్చేసింది. 

Sushmita Sen reveals her wedding plans:

Sushmita Sen On Why She Never Married

Tags:   SUSHMITA SEN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ