కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయిన పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తీ ప్రస్తుతం కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆర్. నారాయణమూర్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు కాస్త ఆందోళన పడ్డారు.
తెలంగాణ మాజీ ఐటి మినిస్టర్ కేటీఆర్.. ఆర్.నారాయణ మూర్తీ త్వరగా కోలుకోవాలని, ఆయనకు అన్ని విధాలుగా BRS పార్టీ అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. తాజాగా నారాయణమూర్తి అనారోగ్యం నుంచి కోలుకుని ఈరోజు నిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న నారాయణమూర్తి.. దేవుడి దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బిరప్ప గారికి, అక్కడ డాక్టర్స్ కు సిబ్బందికి నా హృదయ పూర్వక ధన్యవాదములు, నాక్షేమాన్ని కోరుకుంటున్న ప్రజా దేవుళ్లకు శిరస్సు వంచి దండం పెడుతున్నా అని అందరికి కృతఙ్ఞతలు తెలియజేసారు.