నయనతార-విగ్నేష్ శివన్ లు లవ్ బర్డ్స్. అంతేకాదు.. వారిద్దరూ బ్యూటిఫుల్ కపుల్. తరచూ వెకేషన్స్ అంటూ పిల్లలిద్దరితో సహా నయన్-విగ్నేష్ లు ట్రిప్స్ వేస్తూ ఉంటారు. అలాగే తాము ఎంజాయ్ చేస్తున్న ప్రతి క్షణాన్ని పిక్స్ రూపమ్ లో అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. 40 ప్లస్ లోకి ఇంకా ఇంకా అందంతో మెరిసిపోతున్న నయనతార ఇప్పటికి బిజీ తారనే.
ఎనిమిదేళ్ల తమ ప్రేమని రెండేళ్ల క్రితమే పెళ్లి బంధంతో పటిష్ఠం చేసుకున్న నయనతార-విగ్నేష్ శివన్ లు సరోగసి ద్వారా ట్విన్స్ మగపిల్లలకు తల్లితండ్రులయ్యారు. ఆ తర్వాత పిల్లలతో కలిసి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్న ఈ జంట తాజాగా ఓ బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసింది.
అది నయనతార-విగ్నేష్ శివన్ లు ఉదయపు నీరెండ లో ఒకరినొకరు ముద్దాడుతూ రొమాంటిక్ ఫొటోలకి ఫోజులిచ్చారు. వైట్ కాస్ట్యూమ్స్ లో నయనతార-విగ్నేష్ లు కనిపించగా, నయనతార తన భర్త విగ్నేష్ కి అందమైన ముద్దు పెడుతున్న పిక్ ఇప్పుడు నెట్టింట సంచలంగా మారింది.