Advertisementt

సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్న సమంత

Sat 20th Jul 2024 12:50 PM
samantha  సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్న సమంత
Samantha bracing for comeback strike సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్న సమంత
Advertisement
Ads by CJ

సమంత గత కొన్నాళ్లుగా సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం లేదు. ఖుషి, సిటాడెల్ తర్వాత షూటింగ్స్ కి బ్రేకిచ్చి అప్పుడే తొమ్మిదినెలలు కావొస్తుంది. ఈ మధ్యలో గ్లామర్ ఫొటోస్ షూట్స్, హెల్త్ టిప్స్ తో సోషల్ మీడియా నుంచి అభిమానులకు దగ్గరగా ఉంటుంది. కొన్నాళ్లుగా సినిమాలపై ఫోకస్ పెట్టని సమంత ఇప్పుడు నటనకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. 

ఆ విషయం సమంత నే చెప్పింది. తాను ఇకపై షూటింగ్స్ కి రెడీ అని. అంతేకాదు సమంత నిర్మాత అవతారమెత్తింది. అందులో భాగంగానే మా ఇంటి బంగారం అంటూ ఓ సినిమాని అనౌన్స్ చేసింది. ఆ సినిమాలో సమంత నిర్మాత మాత్రమే కాదు.. హీరోయిన్ కూడా ఆమె. అంటే కాకుండా తమిళనాట విజయ్ సినిమాలో సమంత కు హీరోయిన్ గా అవకాశం వచ్చింది అనే టాక్ ఉంది. 

మరోపక్క సమంత హిందీలో కూడా ఓ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది అనే ప్రచారం ఉండగా.. ఇప్పుడు సమంత త్వరలోనే కమ్ బ్యాక్ ఇవ్వబోతుందట. మరి సమంత అన్నీ ప్రిపేర్ చేసుకుని షూటింగ్ కి రెడీగా ఉంది ఓకె.. ముందుగా ఆమె సైన్ చేసిన ఏ సినిమా సెట్స్ లోకి సమంత అడుగుపెడుతుందా అని ఆమె అభిమానులు చాలా అంటే చాలా క్యూరియాసిటీ తో ఉన్నారు. 

Samantha bracing for comeback strike:

Samantha readies for comeback

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ