నందమూరి ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినా.. మొదటి నుంచి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే నటుడిగా చాల కష్టపడుతూ.. పడుతూ, లేస్తూ.. ఈరోజు గ్లోబల్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రాన్ని చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఆయన బావమరిది నార్నె నితిన్ కూడా హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు.
నితిన్ ఆయ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. తాజాగా సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. పెద్ద కుటుంబం నుంచి హీరోని తీసుకుంటున్నామని నితిన్ గురించి తారక్ కి ఫోన్ చేశాను. కానీ తారక్ మాత్రం ఏదో హీరోగా లాంచ్ అయ్యేవరకే మన బాధ్యత మిగతాదంతా తన కష్టం పైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
మీరు పెద్ద నిర్మాత, మీకు అన్ని తెలుసు అంటూ మా మీద నమ్మకంతో తారక్ అన్ని నా మీదే పెట్టేసాడు. (మొదటి నుంచి ఎన్టీఆర్ బావమరిది విషయంలో లైట్ గానే కనిపిస్తున్నాడు తప్ప అతని సినిమాలు మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ప్రమోట్ చెయ్యడం లేదు.) ఇప్పుడు కూడా తారక్ ఎవ్వరైనా కష్టపడితే ఫలితం ఉంటుంది అని మొహమాటం లేకుండా బావమరిది విషయంలో చెప్పేయడం హాట్ టాపిక్ అయ్యింది.