ఆగస్ట్ 20 మహేష్ కూతురు, సెలెబ్రిటీ కిడ్ సితార బర్త్ డే. స్టార్ కిడ్స్ కి సోషల్ మీడియాలో బర్త్ డే లొచ్చాయంటే వారిని విష్ చేస్తూ తెగ ట్వీట్స్ వేస్తారు. అందులోను సితార సెలెబ్రిటీ కిడ్. ఆమెకి సోషల్ మీడియాలో స్టార్స్ కున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డాన్స్ మాత్రమే కాదు చాలా విషయాల్లో సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.
ప్రస్తుతం సితార తండ్రి మహేష్, తల్లి నమ్రత, అన్న గౌతమ్ లతో కలిసి వెకేషన్స్ లో ఉంది. రీసెంట్ గానే సితార మహేష్-నమ్రతలతో కలిసి అనంత్ అంబానీ వెడ్డింగ్ లో సందడి చేసింది. అక్కడ బాలీవుడ్ సెలబ్రిటీస్ తో ఫొటోస్ దిగుతూ హడావిడి చేసింది. ఇక నేడు సితార బర్త్ డే కావడంతో మహేష్ కూతురుని స్పెషల్ గా విష్ చేసాడు.
సితార పిక్ ని పోస్ట్ చేస్తూ.. Happy 12 my sunshine! ☀️♥️ హ్యాపీ 12 నా చిట్టి తల్లి, ఒక స్టార్ లా ఎప్పటికీ షైన్ అవుతూ ఉండు ఈ స్పెషల్ డే నీకు మరింత స్పెషల్ గా మారాలి. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ క్యూట్ గా మహేష్ కూతురు కు బర్త్ డే విషెస్ ని సోషల మీడియా ద్వారా తెలియజేసారు.