Advertisementt

వేణు స్వామిగారు ఏం చెప్పారండీ..

Sat 20th Jul 2024 10:09 AM
venu swamy  వేణు స్వామిగారు ఏం చెప్పారండీ..
Venu Swamy about predictions వేణు స్వామిగారు ఏం చెప్పారండీ..
Advertisement
Ads by CJ

ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఏపీలో 2024 ఎలక్షన్ లో చంద్రబాబు ఓడిపోతాడు, జగన్ మళ్ళీ  సీఎం అవుతాడు, నా మాట గనక తప్పయితే నేను జాతకాలు చెప్పను అంటూ బిల్డప్ ఇచ్చి.. జూన్ 6 న ఏపీలో వైసీపీ మట్టికొట్టుకుపోయి కూటమి భారీగా గెలవడంతో అప్పటికప్పుడు వేణు స్వామి తాను ఇకపై జాతకాలు చెప్పను అంటూ వీడియో వదిలాడు. ఆ తర్వాత పబ్ లో తేలాడు.

తాజాగా వేణు స్వామి తాను సెలబ్రిటీస్ కి మత్రమే జాతకాలు చెప్పడం లేదు, జగన్ గెలుస్తాడు, చంద్రబాబు ఓడిపోతాడని చెప్పాక నన్ను ట్రోల్ చేసారు. నేను సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాను. అయినా రాహుల్ గాంధీ, జగన్, కెసిఆర్ ఇప్పుడు ఓడిపోయినా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి మంచి రోజులొస్తాయి. మీరు చూస్తూ ఉండండి అని చెప్పాడు. 

తాను ప్రస్తుతం సెలబ్రిటీస్ కి సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం లేదు, క్రికెట్ ప్రెడిక్షన్స్ ఇవ్వడం లేదు. కానీ నేను ఇంటికొచ్చిన సెలబ్రిటీస్ కి జాతకాలు చెబుతున్నాను. అయినా నేను క్రికెట్ లో కానీ,లేదంటే రాజకీయాల్లో కానీ ఎవరు గెలుస్తారో ముందే చెబితే బేటింగ్స్ కాసి మోసపోతున్నారు. వైసీపీ గెలుస్తుంది అని మీరు చెప్పారని నేను పందెం కట్టాను, ఓడిపోయాను అంటూ ఒకతను నాతో అన్నాడు.

అందుకే నేను ప్రిడిక్షన్స్ చెప్పడం మానేసాను. నేను చెప్పినందు వలన చాలామంది బెట్టింగ్స్ కాస్తున్నారు. అందుకే నేను ప్రిడిక్షన్స్ ఇవ్వడం లేదు అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చాడు. అది చూసిన నెటిజెన్స్ ఏదైనా నువ్వు మాములోడివి కాదు వేణు స్వామి.. ఏం చెప్పినా భలే కన్విన్సింగ్ గా చెబుతావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Venu Swamy about predictions:

Astrologer Venu Swamy About 2025 Year Predictions

Tags:   VENU SWAMY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ