అవును.. ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఈ మాటే వినిపిస్తోంది..! అనితకు హోం మంత్రి శాఖ ఊడనుందనే చర్చే జరుగుతోంది..! ఇక సోషల్ మీడియాలో అయితే.. టీడీపీ, జనసేన కార్యకర్తలు, వీరాభిమానులు అయితే అంతా అయిపోయింది అతి త్వరలోనే మేడమ్ ఉండరంతే.. అన్నట్లుగా పోస్టులు పెడుతుండటం గమనార్హం. దీంతో అసలు ఏం జరుగుతోంది..? పట్టుమని నాలుగైదు నెలలు కూడా కాలేదు.. ఎందుకిలా..? అసలేమైంది..? అని జనాల్లో చర్చ మొదలైంది. ఇంతకీ మేడమ్ పోస్టు ఉంటుందా.. ఊడుతుందా..!!
ఏంటిది.. అనితమ్మా!
హోం మంత్రి పదవి దక్కించుకున్న అనిత.. సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించడంలో అట్టర్ ప్లాప్ అయ్యారనే ఆరోపణలు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు.. సొంత నియోజకవర్గం నుంచి వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఒకటా రెండా లెక్కలేనన్ని ఫిర్యాదులు వెల్లువెత్తాయట. ఎందుకంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించడం, ఈ పరిస్థితుల్లో కూడా అనిత సక్రమంగా ఉండకపోడమే ఇందుకు కారణమట. పోనీ.. మీడియా ముందుకు వచ్చి సరిగ్గా మాట్లాడుతారా..? అంటే అదీ లేదు. వినుకొండలో జరిగిన భయానక ఘటన తర్వాత హోం మంత్రి నుంచి ఎలాంటి స్పందన రావాలి..? ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తాం.. ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే భయపడేలా చేస్తామని సర్వసాధారణంగా అనిత నోటి నుంచి రావాల్సిన మాటలు. కానీ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు ఇబ్బంది పడ్డారని.. టీడీపీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారని మాట్లాడటం గమనార్హం. ఇవన్నీ ఒక ఎత్తయితే.. నేను కూడా ఇబ్బంది పడ్డానని.. నేను లాఠీ తీసుకుని వెళ్లలేను కదా..? అని హోం మంత్రి నోట మాటలు రావడంతో మంత్రి వర్గం, చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయారట.
కష్టమే..!
అనిత మాటలు వందకు వెయ్యి శాతం.. శాంతి భద్రతల విషయంలో చేతులెత్తిసినట్టే, ప్రభుత్వాన్ని ఇరకాటాన పెట్టినట్లే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు..! ఇవన్నీ ఒక ఎత్తయితే.. టీడీపీ కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని దీనివల్ల పార్టీ నష్టపోతుందని శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుతోందని అనిత టీడీపీ శ్రేణులుకు విజ్ఞప్తి చేయడం ఏదైతే ఉందో.. ఈ మాటను అర్థం చేసుకోన్నోళ్లకు చేసుకున్నంత అంతే..! సింపుల్‌గా చెప్పాలంటే.. ఏపీలో జరుగుతున్న అరాచకాలకు టీడీపీనే కారణమని హోం మంత్రి అఫిషియల్‌గా ఆమోద ముద్ర వేశారన్న మాట. ఇలా ఒకటా రెండా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకూ ఏదో ఒకలా ప్రభుత్వాన్ని ఇరకాటాన పెట్టేసి.. నలుగురి నోళ్లలో నానేలా చేస్తున్నారే తప్ప పదవికి వన్నె తెచ్చేలా చేయట్లేదని చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో రగిలిపోతున్నారట.
వాట్ నెక్స్ట్..?
అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ నెల చివరికల్లా అనిత మంత్రి పదవి ఊడిపోయే ప్రమాదం ఉందని టీడీపీ వర్గాలే చెప్పుకుంటున్న పరిస్థితి. హోం శాఖ అంటే కీలక పదవి.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాల్సిందిపోయి.. అనిత తీరుతో ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు, లేనిపోని ఆరోపణలు వస్తున్నాయని అగ్రనేతలు మండిపడుతున్నారట. ఇక హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య అయితే మంత్రిపైన రగిలిపోతున్నారట. ఇందుకు కారణం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే.. అనితకు వేరొక శాఖను కేటాయించి.. హోం శాఖను సీనియర్ నేత కళా వెంకట్రావుకు కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని లీకులు వస్తున్నాయి. ఇందులో నిజానిజాలెంత అనేది ఈ నెల చివరికల్లా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..!