Advertisement
TDP Ads

బిగ్ బాస్ సీజన్ 8 లిస్ట్ లీక్

Fri 19th Jul 2024 06:12 PM
bigg boss telugu 8  బిగ్ బాస్ సీజన్ 8 లిస్ట్ లీక్
Bigg Boss Season 8 List Leaked బిగ్ బాస్ సీజన్ 8 లిస్ట్ లీక్
Advertisement

బిగ్ బాస్ సీజన్ 8 మొదలు కావడానికి మరో నేలపైనే సమయం ఉంది. ఆగష్టు చివరి వారం అయినా, సెప్టెంబర్ మొదటి వారంలో కానీ బిగ్ బాస్ సీజన్ 8 మొదలు కానుంది. నాగార్జున ఈసారి హోస్ట్ గా రారు.. ఇతర హీరోలు వచ్చే ఛాన్స్ వుంది అంటూ ప్రచారం జరిగినా ఫైనల్ గా సీజన్ 8 కి హోస్ట్ గా నాగార్జునే రాబోతున్నారు. ఇప్పటికే ఆయన బిగ్ బాస్ సీజన్ 8 కి సైన్ కూడా చేసారని టాక్. 

తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 లోకి రాబోయే వారి పేర్లు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో మొదటి నుంచి ప్రముఖ జ్యోతిష్కులు వేణు స్వామి ఈ సీజన్ లోకి అడుగుపెట్టబోతున్నారని, గ్లామర్ డాల్ వర్షిణి కూడా సీజన్ 8 లోకి రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి బుల్లితెర సెలెబ్రిటీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట. 

ఈ సీజన్ లో సీరియల్ నటి తేజస్విని, యాంకర్ వింద్యా, విష్ణుప్రియ, శ్వేతా నాయుడు, అంజలి, ఇంద్రనీల్ వర్మ, కమెడియన్ సద్దాం, సీరియల్ నటుడు శివ కుమార్‌ల తో పాటుగా ఇప్పుడొక సీనియర్ హీరో సీజన్ 8 కి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో వినోద్ కుమార్ సీజన్ 8 లో కనిపిస్తారని టాక్. 

అంతేకాకుండా మై విలేజ్ షో అనిల్, తెలుగు హీరోయిన్ కుషిత కల్లాపు, సుప్రిత, యూట్యూబర్ శీతల్ గౌతమ్, సన, ఊర్మిళ చౌహాన్, యూట్యూబర్ యువ సామ్రాట్, కమెడియన్ బబ్లూ లాంటి వాళ్లు బిగ్ బాస్ సీజన్ 8 లోకి వచ్చే లిస్ట్ లో ఉన్నారంటున్నారు. చూద్దాం ఫైనల్ గా ఎవరెవరు సీజన్ 8 హౌస్ లోకి అడుగుపెడతారో అనేది. 

Bigg Boss Season 8 List Leaked:

Bigg Boss Telugu 8 Contestants List Leaked

Tags:   BIGG BOSS TELUGU 8
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement