మహేష్ అభిమానులకు నిరాశే మిగిలేలా ఉంది. ఆగష్టు 9 న మహేష్ బాబు బర్త్ డే. అంటే ఆగస్టు 9 న మహేష్ కొత్త మూవీ అందులోను పాన్ ఇండియా ఫిలిం పై అప్ డేట్ ఉంటుందేమో అని మహేష్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ వారికి ఇప్పుడు డిజ్ పాయింట్ అయ్యేందుకు రెడీ అవ్వాల్సి వస్తుందేమో అనే వార్త వైరల్ అయ్యింది.
కారణం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులు, కాన్సప్ట్ వీడియో ఇంకా ఫైనల్ కాలేదట. సెప్టెంబర్ వరకు రాజమౌళి-మహేష్ మూవీపై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేమంటున్నారంటూ సోషల్ మీడియాలో జరిగే ప్రచారానికి మహేష్ అభిమానులు నీరుగారిపోతున్నారు. అసలే గుంటూరు కారం విడుదలై ఆరు నెలలు పూర్తయ్యింది.
కానీ ఇప్పటివరకు మహేష్ కొత్త సినిమా కబురు వినిపించడం లేదు. మహేష్ మాత్రం ఫ్యామిలీతో కలిసి స్విజర్లాండ్, లండన్, జర్మనీ, ముంబై అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు రాజమౌళి కాంపౌండ్ కామ్ గా పని చేసుకుంటుంది. కనీసం బర్త్ డే రోజునైనా రాజమౌళి-మహేష్ బాబు కాంబో పై ప్రకటన ఇస్తే బావుంటుంది అని వారి కోరిక. కానీ అదే తీరేలా కనిపించడం లేదు.