పాపం జగన్ పెంచి పోషించిన బ్లూ మీడియా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి ఎదురు తిరిగింది. జగన్ నుంచి అందాల్సిన సొమ్ము అందలేదో.. మరేదన్నా గొడవ జరిగిందో తెలియదు కాని.. ఒకప్పుడు జగన్ దేవుడు, రాముడు, జగన్ ఏం చేసినా మంచే, జగన్ నడిచినా వార్తే, కూర్చున్నా వార్తే అన్నట్టుగా ప్రవర్తించిన బ్లూ మీడియా ఇప్పుడు జగన్ కి వ్యతిరేఖ కథనాలు ప్రసారం చేస్తుంది.
చంద్రబాబు పరమ దుర్మార్గుడు, లోకేష్ ఓ పనికి మాలినవాడు, పవన్ కళ్యాణ్ కి సినిమాలే ఎక్కువ, రాజకీయాలెందుకు అన్న ఓ ప్రముఖ వెబ్ సైట్.. ఇప్పుడు జగన్ వేస్ట్, అతనొక లక్కీ సీఎం అంటూ కథనాలు రాయడం మాత్రం ఎవ్వరికి షాకిచ్చినా, ఇవ్వకపోయినా.. వైసీపీ కార్యకర్తలకు, నేతలకు ఖచ్చితంగా షాకిచ్చే ఉంటుంది. పోరాడాడు, గెలిచాడు, ప్రజల కోసం పని చేసాడు, తండ్రి మరణం తర్వాత నిలబడ్డాడు అంటూ గొప్పగా చెప్పిన ఆ మీడియా ఇప్పుడు జగన్ ఏదో కాలం కలిసొచ్చి సీఎం అయ్యాడు కానీ.. లేదంటే అనడం వెనుక ఆ బ్లూ మీడియా ఎంత కోల్పోయిందో.. వైసీపీ సోషల్ ఇండియా ఆ వెబ్ మీడియాకి ఎంత బకాయి పడిందో.. అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్.
లాటరీ మళ్ళీ మళ్ళీ తగలదు సీఎం అవ్వడానికి.. అయినా ఒకసారి ఓడిపోతే మరోసారి గెలవకూడదని లేదు, కానీ ఇలా ఓడిపోయాక కామ్ గా కూర్చుంటే ఎలా గెలుస్తారు. ఇప్పటికి తన చుటూ ఉన్న కోటరిపైనే ఆధారపడితే మళ్ళీ ఎదురు దెబ్బలు తప్పవు. ఇలా ఏ విషయంలో స్పందించకుండా ఉంటే ఎలా జగన్, లాటరీ కొట్టి సీఎం అయ్యావు, కానీ మళ్ళీ లాటరీ తగలాలంటే ఎలా సర్ అంటూ బ్లూ మీడియా జగన్ పై రెచ్చిపోయి కథనాలు రాస్తుంది.
వైసీపీ సోషల్ మీడియా బాగా వీక్, అదే ఐ టీడీపీ సోషల్ మీడియా మాత్రం స్ట్రాంగ్. ఏపీలో ప్రస్తుతం ఏది జరిగినా టీడీపీ వారు సోషల్ మీడియాలో 1 కి 100 ట్వీట్లు వేస్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఆ ఒక్క ట్వీట్ వేయడంలోను వెనకబడిపోతున్నారు. టీడీపీ అంటే సోషల్ మీడియాలో ప్రాణం పెట్టి పనిచేసేవారే ఎక్కువ, కానీ వైసీపీ అంటే డబ్బులు తీసుకుని ఆధారపడి పబ్లిసిటీ ఇచ్చేవారు ఎక్కువ. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదు. సో వైసీ నుంచి డబ్బు రాదు అనే సోషల్ మీడియా వాళ్ళు కూడా కామయ్యారంటూ ఆ ప్రముఖ వెబ్ సైట్ రాయడం గమనార్హం.