నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి రంగం సిద్దమైపోతుంది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి తేజస్విని(బాలయ్య చిన్న కుమార్తె) నిర్మాతగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పట్టాలెక్కబోతుంది. మరి ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతోంది, దానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ ఎంతవరకు వచ్చిందో అంటూ నందమూరి అభిమానులు క్యూరియాసిటీతో ఉన్నారు.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మూవీపైనే కూర్చున్నారట. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లుగా తెలియడమే కాదు.. అక్టోబర్ నుంచి అంటే దసరా నవరాత్రుల్లో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ని పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టి వెంటనే రెగ్యులర్ షూట్ కి వెళ్లేలా బాలయ్య ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్.
మరి బాలకృష్ణ తనకి, తన పిల్లలకు సంబంధించి ఏది మొదలు పెట్టాలన్నా ముహుర్తాలు, మంచి-చేడు అన్ని చూస్తారు. అలా మోక్షజ్ఞ ని హీరోగా లాంచ్ చేసేందుకు దేవి నవత్రులైతే బావుంటుంది అని.. దసరా సమయంలో అతని మొదటి మూవీ ని మొదలు పెట్టె ఆలోచనలో బాలయ్య ఉన్నారని సన్నిహిత వర్గాల సమాచారం.