Advertisementt

జైలు ఫుడ్ పడడం లేదు అంటున్న హీరో?

Fri 19th Jul 2024 11:02 AM
actor darshan  జైలు ఫుడ్ పడడం లేదు అంటున్న హీరో?
Darshan Files Petition Seeking Home-Cooked Food జైలు ఫుడ్ పడడం లేదు అంటున్న హీరో?
Advertisement
Ads by CJ

తనకి జైలు ఫుడ్ పడడం లేదు.. ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి అనుమతి నివ్వండి అంటూ స్టార్ హీరో హై కోర్టుని ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది. సెలబ్రిటీస్ గా ఉన్నప్పుడు డైట్ మైంటైన్ చేస్తూ, జిమ్ లో వర్కౌట్ చేస్తూ అత్యంత జాగ్రత్తలు తీసుకునే స్టార్ హీరోలు.. జైలు పాలయ్యాకా జైలు ఫుడ్ పడడం లేదు, అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అనడంలో వింతేమీ లేదు. 

కన్నడ స్టార్ హీరో దర్శన్ చిత్రదుర్గం కి చెందిన తన అభిమానిని అత్యంత దారుణంగా కిరాయి రౌడీలతో చంపించిన కేసు గురించి అందరికి తెలిసే ఉంటుంది. నిన్నమొన్నటివరకు ఈ కేసు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చక్కర్లు కొట్టింది. తన ప్రియురాలు పవిత్ర గౌడ తో పాటుగా హీరో దర్శన్, మరో 15 మంది రేణుక స్వామి హత్య కేసులో ఖైదీలుగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. 

దర్శన్ కస్టడీ కోర్టు పొడిగించడంతో గత రెండు నెలలుగా పరప్పన జైలులో ఉన్న దర్శన్ తనకి జైలు ఫుడ్ పడక ఆరోగ్యం క్షీనిస్తుంది అని, అందుకే తనకి ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టు లో పిటిషన్ వేసాడు. అయితే ఈ పిటిషన్ పై ప్రభుత్వ న్యాయవాది కోర్టులో తీవ్ర అభ్యంతరం లేవనెత్తాడు. ఈ కేసుని ప్రస్తుతం కోర్టు వాయిదా వేసింది. 

Darshan Files Petition Seeking Home-Cooked Food :

Actor Darshan Files Petition Seeking Home-Cooked Food In Prison

Tags:   ACTOR DARSHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ