Advertisementt

గేమ్ చేంజర్: హై క్రియేట్ చేసిన డైలాగ్ రైటర్

Fri 19th Jul 2024 10:40 AM
game changer  గేమ్ చేంజర్: హై క్రియేట్ చేసిన డైలాగ్ రైటర్
Sai Madhav Burra on Game Changer గేమ్ చేంజర్: హై క్రియేట్ చేసిన డైలాగ్ రైటర్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ విడుదల కాకుండానే కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్నాడనగానే అందరిలో ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ మొదలయ్యింది. అప్పట్లో ఏ అప్ డేట్ వచ్చినా ఇట్టె వైరల్ అయ్యేది. కానీ కొద్దిరోజులుగా శంకర్ గేమ్ చేంజర్ అప్ డేట్స్ వదలకుండా మెగా అభిమానులను విసిగిస్తున్నారు. 

దానికి తోడు శంకర్ నుంచి రీసెంట్ గా వచ్చిన భారతీయుడు 2 సౌత్ లో అతిపెద్ద డిసాస్టర్ గా నిలిచింది. దానితో గేమ్ చేంజర్ అవుట్ ఫుట్ పై మెగా ఫ్యాన్స్ లో ఒకరకమైన ఆందోళన మొదలయ్యింది. అయితే మెగా అభిమానుల ఆందోళనను గేమ్ చేంజర్ డైలాగ్ రైటర్ బుర్ర సాయి మాధవ్ క్షణాల్లో మాయం చేసారు. అంతేకాదు ఆయన ఇచ్చిన అప్ డేట్ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. 

గేమ్ చేంజర్ ఒక కంప్లీట్ ప్యాకేజీలా ఉంటుంది. శంకర్ గారి నుంచి సగటు ప్రేక్షడు ఆశించే అన్ని అంశాలూ గేమ్ చేంజర్ లో ఉంటాయి. శంకర్ ఫస్ట్ టైమ్ తెలుగులో చేస్తున్న స్ట్రయిట్ చిత్రమిది. అందుకే తెలుగు డైలాగ్స్ గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. దర్శకుడు క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడరు. 

ఈ సినిమా ఖచ్చితంగా రామ్ చరణ్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు. నాతో శంకర్ గారు తెలుగులోనే మాట్లాడతారు. చాలామంది తెలుగు వారి కంటే ఆయన తెలుగు మెరుగ్గా ఉంటుంది.. అంటూ సాయి మాధవ్ బుర్ర గేమ్ చేంజర్ పై ఎలాంటి ఆందోళన వద్దు.. మీకు కావాల్సిన అవుట్ ఫుట్ పక్కా అని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. 

Sai Madhav Burra on Game Changer:

Dialogue Writer stunning remarks on Game Changer

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ