గత కొద్దిరోజులుగా మీడియాలో హీరో రాజ్ తరుణ్-లావణ్య మధ్యలో మాల్వి మల్హోత్రా అంటూ ఓ కేసు తెగ హైలెట్ అవుతుంది. రాజ్ తరుణ్ లావణ్య ని మోసం చేసి హీరోయిన్ మాల్వి మల్హోత్రా తో కలిసి సహజీవనం చేస్తున్నాడని, తనకి న్యాయం చెయ్యాలంటూ లావణ్య బయలు దేరింది. రాజ్ తరుణ్ లావణ్యకి డ్రగ్స్ అలవాట్ల తో పాటుగా చేడు స్నేహాలున్నాయంటూ వాదిస్తున్నాడు.
మధ్యలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఆమె తమ్ముడు కలిసి లావణ్యని బెదిరించిన కేసు కూడా బయటికొచ్చింది. లావణ్య కేసులో ఆధారాలు కూడా దొరకడంతో రాజ్ తరుణ్ పై పోలీసులు A 1 ముద్దాయిగా, మాల్వి మల్హోత్రాపై A 2 ముద్దాయిగా, మాల్వి సోదరుడు ని A 3 ముద్దాయిగా చేర్చారు. అయితే ఈ కేసులో రాజ్ తరుణ్ కు విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చారు.
కానీ రాజ్ తరుణ్ తన లాయర్ తో తాను విచారణకు హాజరు కావడం లేదు అని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తాను అందుబాటులో లేనని విచారణకు హాజరు కాలేనని రాజ్ తరుణ్ లాయర్ ద్వారా తెలిపారు. కాని వ్యక్తి గతంగా రాజ్ తరుణ్‌ను విచారణ చేయాలనుకుంటున్నారు పోలీసులు.. దీనిని బట్టి పోలీసులు రాజ్ తరుణ్ కు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది.