మెగా డాటర్ నిహారిక పెళ్ళికి ముందు కాస్త పద్దతిగా కనిపించేది, అప్పుడు గ్లామర్ షో చేసినా దానికి కొంతమేర హద్దులు పెట్టుకునేది. పెళ్లి, విడాకులు అయ్యాక నిహారిక నటనకు దగ్గరయ్యే దారులు వెతుక్కుంటుంది. ఇప్పటికే నిర్మాతగా సినిమాలు, వెబ్ సీరీస్ లు చేస్తున్న నిహారిక కి సినిమా ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.
మహాతల్లి, వితిక శేరు లతో తరచూ వెకేషన్స్ కి వెళ్లే నిహారిక తన కొత్త చిత్రాలను మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హడావిడి చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపించే నిహారిక తాజాగా రెడ్ అవుట్ ఫిట్ లో మురిసిపోయిన పిక్స్ షేర్ చేసింది. ఆ రెడ్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో మెగా డాటర్ నిహారిక నిజంగా కుందనపు బొమ్మలా ఉంది.
ఆ డ్రెస్ లో కూడా నిహారిక అందాలను చూపించి చూపించనట్టుగా చూపించేసింది. చిరునవ్వుతో అందరిని పడేసింది. నిహారిక తాజా లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.