కమెడియన్ ఆలీ-పవన్ కళ్యాణ్ చాలా మంచి దోస్త్ లు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆలీ కి సూపర్ కేరెక్టర్ పడేది. పవన్ కళ్యాణ్-ఆలీ ఎక్కువగా కలిసి కనిపించేవారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక ఆలీ పవన్ వెంట నడవలేదు. ఓకె ఆలీ రాజకీయాలకు దూరంగా ఉంటాడేమో అనుకుంటే ఆయన వైసీపీ లో జాయిన్ అయ్యాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసాడు. పవన్ పై పోటీకి సై అన్నాడు.
వైసీపీ పార్టీలో పదవులు ఆశించి భంగపడిన ఆలీని పవన్ కళ్యాణ్ కూడా లైట్ తీసుకున్నారు. ఆయన సినిమాల్లో అలీని లేపేశారు. అది పవన్ చెబితే జరిగిందో కాకతాళీయంగా జరిగిందో తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆలీ కనిపించడం మానేసాడు. ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది. అటు పదవులు లేక ఇటు స్నేహము లేక దిగాలు పడిన ఆలీ చివరికి రాజకీయాలకు, వైసీపీ కి స్వస్తి చెప్పి కామయ్యాడు.
అయినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆలీకి కేరెక్టర్స్ అనేవి ఇక కలే అని చెప్పుకుంటున్న సమయంలో ఆలీ సుమ షోకి వచ్చాడు. సుమ షో లో మీకు రవితేజ తో చేసినప్పుడు, లేదంటే పవన్ కళ్యాణ్ తో కలిసి నటించినప్పుడు కమ్ ఫర్ట్ గా ఫీలయ్యారా, మీ జోడి బాగా వర్కౌట్ అయినట్లుగా అనిపించిందా అని అడగగానే.. అలీ చాలా ఆలోచించాడు. ఆలీ ఏం చెబుతాడా అని షోలో తోటి నటులు, మిగతా ఆడియన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేసారు.
ఆలి మాత్రం తనకి పవన్ కళ్యాణ్ తో కలిసి నటించినప్పుడు కమ్ ఫర్ట్ గా అనిపించింది అని చెప్పాడు. మరి అలీ చెప్పిన ఆన్సర్ చూస్తే ఇది పవన్ కళ్యాణ్ ని కాకా పడుతున్నట్టుగా లేదూ.. అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.