జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఓడిపోయాక మీడియా ముందుకు వచ్చి ఓటమికి కారణాలేమీ లేవు.. ప్రజలకు మంచి చేసి ఓడిపోయామన్నాడు. ఆ తర్వాత అసెంబ్లీలో ఎమ్యెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి పులివెందులకు వెళ్ళిపోయి అటునుంచి అటే బెంగుళూరు ప్యాలెస్ కి వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి ఆతర్వాత ఓ పది రోజులు బెంగుళూరులో సైలెంట్ గా ఉండిపోయారు.
ఇక పిన్నెల్లి జైలుకెళ్లాక అతన్ని ఓదార్చడానికి వచ్చి పిన్నెల్లి తప్పేమి లేదు, ఇది కావాలనే టీడీపీ చేస్తున్న కుట్ర అని చెప్పి ఆతర్వాత మళ్ళీ సైలెంట్ అయ్యారు. మద్యలో అటు ఇటుగా చిన్న హడావిడి చేసిన జగన్ వైస్ జయంతి రోజున పులివెందుల వెళ్లి తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన జగన్.. విజయ్ సాయి రెడ్డి ఉదంతంలో ఒక్క మాట కూడా మాట్లాడకూండా కామ్ గా రెండు రోజుల క్రితమే బెంగుళూరు వెళ్లిపోయారు.
అయితే ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు.. అంటూ ఓ ట్వీట్ వేశారు. కారణం వైసీపీ కార్యకర్తని వినుకొండలో టీడీపీ కార్యకర్తలు చంపేశారంటూ ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వంపై జస్ట్ సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు తప్ప.. తాను వెళ్లి ఆ వైసీపీ కార్యకర్త ఫ్యామిలీని ఓదార్చలేదు.
ఈ విషయంలో జగన్ ని ఆఖరుకి బ్లూ వీడియో విమర్శిస్తోంది. జగన్ ఇంట్లో కూర్చుంటే ఎలా వెళ్లి వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి వస్తే సింపతీ వస్తుంది. ఇలా ఇంట్లో కూర్చుని ట్వీటేస్తే ఏం లాభముండదు. ప్రజల్లోకి వెళ్ళు.. అప్పుడే నీకు మైలేజ్ వస్తుంది అంటూ జగన్ ని విమర్శించడం నిజంగా ఆశ్చర్యకర విషయమే.