రామ్ చరణ్ గత మూడేళ్ళుగా కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో ట్రావెల్ అవుతూ.. ఫైనల్లీ ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేశారు. గేమ్ చేంజర్ కంప్లీట్ అయ్యాక రామ్ చరణ్ భార్య ఉపాసన తో సహా ముంబై లో జరిగిన అంబానీ ఇంట పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ భార్య, కుమార్తెతో సహా అటునుంచి అటే లండన్ వెళ్లిపోయారు.
చరణ్ లండన్ ఎందుకు వెళ్లారనే న్యూస్ వైరల్ గా మారింది. రామ్ చరణ్ లండన్ లో RC 16 కోసం ట్రైన్ అవుతున్నాడట. బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోయే RC 16 ఆగష్టు నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతుంది. అందుకే చరణ్ ఈ మధ్యలో లండన్ వెళ్లి అక్కడ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారట. అందుకోసమే చరణ్ లండన్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది.
అయితే చరణ్ పెంపుడు పెట్ రైమ్ లండన్ లో ఆడుకుంటూ కనిపించింది. దానితో రామ్ చరణ్ వెకేషన్ లో భార్య, కుమార్తె క్లింకార తో సహా వెకేషన్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. రైమ్ ఇన్ స్టా ఖాతాను ఫాలో అయ్యే వారికి అర్థం అసలు విషయం అవుతుంది. రామ్ చరణ్ పెట్ రైమ్ ఇప్పుడు లండన్‌లో ఉంది.. చరణ్ లండన్ లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తో పాటుగా భార్య పాప తో కలిసి కాస్త రిలాక్స్ అవుతున్నారని మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.