Advertisementt

దీపికా డైట్ గురించి విన్నారా..

Thu 18th Jul 2024 12:08 PM
deepika padukone  దీపికా డైట్ గురించి విన్నారా..
Deepika Padukone shares her secrets to a balanced diet దీపికా డైట్ గురించి విన్నారా..
Advertisement
Ads by CJ

హీరోయిన్స్ డైట్ గురించి తెలుసుకోవాలని, అదే ఫాలో అయ్యి సన్నగా మారాలని చాలామంది టీనేజ్ అమ్మాయిలు, మహిళలు అనుకుంటారు. అమ్మాయిలైతే అచ్చం హీరోయిన్ లా ఉండేందుకు కడుపు మాడ్చుకుని డైట్ డైట్ అంటూ తినడం కూడా మానేస్తారు. రకుల్ ప్రీత్ ఏ డైట్ ఫాలో అవుతుందో.. కాజల్ అగర్వాల్ బిడ్డకు తల్లయినా అంత నాజుగ్గా ఎలా ఉందొ.. ఆమె ఏ డైట్ మైంటైన్ చేస్తుందో అని చాలామంది అనుకుంటారు. 

ఇక బాలీవుడ్ హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. జీరో సైజ్ కోసం తినడం మానేసి జిమ్ ల వెంట తిరుగుతారని అందరూ మాట్లాడుకుంటారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె ఇప్పుడు ప్రెగ్నెంట్. ఆమె ఇప్పటికి సన్నగానే కనిపిస్తుంది. అలా ఉండడానికి ఆమె ఏదో ఒక డైట్ ఫాలో అవుతుంది అంటూ రకరకాల వార్తలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

కానీ దీపికా పదుకొనె మాత్రం డైట్ అంటే కడుపు మాడ్చుకోవడం కాదు అంటుంది. డైట్ అనే పదం వెనుక చాలా అపోహలున్నాయి, డైట్ అంటే తక్కువ తినడం, కడుపు మాడ్చుకోవడం, ఇష్టం లేనివి తినడం అని మనం అనుకుంటాము, కానీ డైట్ అంటే మనం తీసుకునే ఆహారం, తీసుకునే నియమాలు మత్రమే. డైట్ అనే పదం గ్రీకు పదం, డైట్ అంటే జీవన విధానం అంటూ దీపికా పదుకొనె డైట్ గురించి చెప్పుకొచ్చింది. 

Deepika Padukone shares her secrets to a balanced diet:

Deepika Padukone Debunks Diet Myths

Tags:   DEEPIKA PADUKONE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ