కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 నుంచి పూర్తిగా బయటికి వచ్చేసారు. లైకా ప్రొడక్షన్ వారు పట్టుబట్టి శంకర్ తో చేయించుకున్న భారతీయుడు 2 చిత్రం గత శుక్రవారం విడుదలై డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది. విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే సినిమాకి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో కలెక్షన్స్ దారుణంగా నమోదు అయ్యాయి.
కమల్ క్రేజ్ కూడా ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించలేకపోయింది. మొదటి వీకెండ్ లోనే అంతంతమాత్రం కలెక్షన్స్ రాగా.. వీక్ డేస్ లో ఇండియన్ 2 మరింత వీకైపోయింది. ఇక శంకర్ ఇండియన్ 2 నుంచి కంప్లీట్ గా బయటికి వచ్చేసి రామ్ చరణ్ గేమ్ చేంజర్ పై ఫోకస్ పెట్టారు అని తెలుస్తోంది. గేమ్ చేంజర్ కి ఉన్న ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్ళబోతున్నారు.
ఇప్పటికే రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి కాగా.. మిగతా బ్యాలన్స్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసి అప్ప్పుడు రిలీజ్ డేట్ ఇచ్చే ఆలోచనలో ఆయన ఉన్నారు. అయితే మధ్య మధ్యలో గేమ్ చేంజర్ షూటింగ్ ని కొంతమంది దర్శకులు హ్యాండిల్ చేశారనే టాక్ ఉంది. అది మొత్తం శంకర్ డైరెక్షన్ లోనే సాగింది. ఇక తన జోనర్ కథ గేమ్ చేంజర్ అంటూ అందరిలో ఇంట్రెస్ట్ కలిగించిన శంకర్ ఈ సినిమా డేట్ ఎపుడు లాక్ చేస్తారో అని మెగా ఫ్యాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు.