ఇప్పుడు అందరి కళ్ళు దేవర మూవీ పైనే ఉన్నాయి. కల్కి వచ్చింది బక్సాఫీసుని కదిలించింది. ఇండియన్ 2 వచ్చింది.. అదే బాక్సాఫీసును నిస్సత్తువుగా మార్చింది. ఇక ఆగష్టు లో ఇస్మార్ట్ శంకర్ లాంటి క్రేజ్ సినిమాలు ఉన్నప్పటికి.. అందరి చూపు సెప్టెంబర్ లో రాబోయే దేవర మూవీ పైనే ఉంది.
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న దేవర మూవీ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కొద్దిగా టెన్షన్ కూడా ఉంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఖచ్చితంగా దేవర తో అంతటి హిట్ అందుకోవాల్సిందే అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక. అటు చూస్తే కొరటాల శివకి ఆచార్య లాంటి బిగ్ డిజ్ పాయింటింగ్ మూవీ ఉంది.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర ఈ మద్యన ఇండియన్ 2 కి పేలవమైన మ్యూజిక్ ఇవ్వడంతో మ్యూజిక్ లవర్స్ తో పాటుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా డిజ్ పాయింట్ అయ్యారు. ఇప్పుడు కొరటాల, అనిరుద్ లు దేవర చిత్రానికి బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వాలి, వీరు ఇద్దరూ దేవర ని ఏం చేస్తారో అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దిగులుపడుతున్నారు.