నవీన్ పోలిశెట్టి కొన్ని నెలల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ బైక్ నడుపుతుండగా.. బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదానికి గురవగా అతనికి చేతికి, కాలుకి ఫ్రాక్చర్ అయినట్టుగా ప్రచారం జరిగింది. కానీ నవీన్ పోలిశెట్టి నుంచి ఎటువంటి అప్ డేట్ ఈ యాక్సిడెంట్ పై బయటకు రాలేదు. కనీసం అతని పీఆర్వో కూడా ఈ యాక్సిడెంట్ పై న్యూస్ ఇవ్వలేదు.
మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత నవీన్ పోలిశెట్టి బయటకు కనిపించలేదు. అది దాదాపుగా ఏడెనిమిది నెలలుగా ఏ రోజు మీడియాకి కనిపించలేదు. ఇప్పుడు తాజాగా తనకు జరిగిన యాక్సిడెంట్ పై నవీన్ పోలిశెట్టి సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యాడు. ఈరోజు నేను మీతో ఒక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అనుకోకుండా నా చేతి బోన్ కి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. కాలికి కూడా గాయమైంది. ఇది నాకు టఫ్ మాత్రమే కాదు.. పెయిన్ ఫుల్ సమయం కూడా. ఈ గాయం వల్ల నేను ఫాస్ట్ గా నా చిత్రాలను మీ ముందుకు తీసుకురాలేకపోతున్నందుకు సారీ.
నేను కంప్లీట్ గా రికవర్ అయ్యి.. మీకు నా బెస్ట్ ఎనర్జిటిక్ వెర్షన్ ని చూపించడానికి వైద్యుల సహాయంతో కోలుకుంటున్నాను. కానీ దానికి చాలా సమయం పట్టొచ్చు. మంచి విషయమేమిటంటే.. ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న నా అప్ కమింగ్ ఫిల్మ్ స్క్రిప్ట్స్ అద్భుతంగా, మీకు బాగా నచ్చే విధంగా రూపు దిద్దుకుంటున్నాయి. నేను పూర్తిగా రికవర్ అయ్యాక వాటి షూటింగ్ ప్రారంభిస్తాము. మీ సపోర్ట్ కి థాంక్స్ అంటూ నవీన్ పోలిశెట్టి యాక్సిడెంట్ విషయాన్ని రివీల్ చేసాడు.