గత వారం ముంబై లో అంగరంగవైభవోపేతంగా జరిగిన ముఖేష్ అంబానీ-నీత అంబానీ ల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ల వివాహానికి హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు చాలామంది సెలబ్రిటీస్ హాజరయ్యారు. ఐదు రోజుల పెళ్లి కి అందరూ ఆహ్వానితులే అన్నట్టుగా బాలీవుడ్ సెలబ్రిటీస్, సౌత్ స్టార్స్ అందరూ ముఖేష్ ఇంటికి క్యూ కట్టారు.
టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, రానా, వెంకటేష్ సతి సమేతంగా హాజరయ్యారు. ఇక కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్, సూర్య, విగ్నేష్ శివన్, అట్లీ ఇలా ప్రముఖులు తమ భార్యలతో సహా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో సందడి చేసారు. మలయాళం నుంచి పృద్విరాజ్ సుకుమారన్, కన్నడ నుంచి యష్ లాంటి స్టార్స్ హాజరయ్యారు.
అయితే వీరందరివి విడివిడిగా ఫోటో ఫ్రేమ్స్ బయటికి వచ్చినా.. తాజాగా వీరంతా కలిసి కూర్చుని ఫొటోలకి ఫోజులిచ్చారు. ఇప్పుడా పిక్ వైరల్ గా మారింది. మహేష్ బాబు, నయనతార, విగ్నేష్ శివన్, సూర్య, జ్యోతిక, జెనీలియా, అఖిల్, మహేష్ డాటర్ సితారలు అందరూ అంబానీ పెళ్ళిలో కలిసి కూర్చుకున్నారు. ఆ పిక్ సోషల్ మీడియాలో చూడగానే వాళ్ళ వాళ్ళ అభిమానులు ఆ పిక్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.