ఈమధ్యన అనంత్ అంబానీ పెళ్ళిలో డిజైనర్ డ్రెస్సులతో మెరుపులు మెరిపించిన రష్మిక మందన్న ఇప్పుడు నార్మల్ గా మారిపోయింది. అది కూడా తలనిండా గులాబీ పూలు పెట్టుకుని సరదాగా కనిపించింది. Extremely unwell but the Phooling arounddd ain’t stopping 🐒🌹 అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.
చాలా అస్వస్థతగా ఉంది కానీ ఫూలింగ్ చుట్టూ ఆగడం లేదు 🐒🌹అంటూ రష్మిక ఆ పిక్స్ ని షేర్ చేసింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో రష్మిక చిరునవ్వులు చిందిస్తూ గులాబీ పూలతో కాస్త కొత్తగా కనిపించింది. ప్రస్తుతం పాన్ ఇండియా మర్కెట్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కనిపిస్తున్న రష్మిక జోరు మాములుగా లేదు.
హిందీలో సల్మాన్ ఖాన్ తో మురుగదాస్ సికిందర్ లో నటిస్తున్న రష్మిక.. ధనుష్ కుబేర, అల్లు అర్జున్ తో పుష్ప 2 ఒన్ ఇండియా మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. మరో పక్క లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తోనూ సత్తా చాటుతుంది రష్మిక.