పుష్ప 2 ఆగష్టు 15 బరి నుంచి పోస్ట్ పోన్ అయ్యాక ఆ సినిమా సెట్స్ లో ఏదో జరుగుతుంది. అసలు ఆగస్టు 15 నుంచి సినిమా పోస్ట్ పోన్ అవడం హీరోకి సుతారమూ ఇష్టం లేదు. అటు దర్శకుడు సుకుమార్ మాత్రం హారి బరిగా సినిమా ని చక్కబెట్టడమంటే నా వల్ల కాదని భీష్మించుకుని కూర్చోవడం.. హీరో-దర్శకుడు మధ్యన నిర్మాతలు నలిగిపోతున్నారనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి.
షూటింగ్ సజావుగా సాగకపోవడంతో హీరో దర్శకుడు మీద అలిగాడు, దర్శకుడు విదేశాలకు వెళ్లాడని మరో న్యూస్ వైరల్ గా మారిపోయింది. అంతేకాదు.. పుష్ప 2 షూటింగ్ సెట్స్ లో హీరో కోపంతో కుర్చీని తన్నేసి వెళ్ళిపోయాడు, అటు దర్శకుడు ఒకొనొక సమయంలో ఐ ఫోన్ విసిరికొట్టారనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
ఇప్పుడు చూస్తే డిసెంబెర్ నుంచి కూడా పుష్ప 2 మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ వుంది వచ్చే ఏడాదే పుష్ప 2 రిలీజ్.. కారణం సెట్స్ లో అంతర్గతంగా రగులుతున్న ఈగో ప్రోబ్లెంస్ అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి మూడేళ్ళుగా అల్లు అర్జున్ ఒకే ప్రాజెక్ట్ పై ఉన్నాడు. అది అతని కోపానికి కారణం అంటుంటే.. మరొపక్క తనకి అవుట్ ఫుట్ పర్ఫెక్ట్ గా రాకపోతే రీ షూట్స్ చెయ్యాల్సిందే అని పట్టుబట్టే దర్శకుడు.
ఇలా వీరిద్దరి సర్ది చెప్పలేక నిర్మాతలు తలపట్టుకుంటున్నారంటున్నారు. మరి నిజంగానే పుష్ప 2 సెట్స్ ల ఏదో జరక్కపోతే ఇలాంటి రూమర్స్ అయితే వాడుకలోకి రావు.