శ్రీలీల ఏ కాస్ట్యూమ్స్ లో అయినా ఇట్టే ఒదిగిపోతుంది. చిన్న ఫ్రాక్ అయినా, మిడ్డీ అయినా, లంగా ఓణీ అయినా, శారీ అయినా ఎందులోనైనా శ్రీలీల అందంగా కనిపిస్తుంది. హైట్ కి హైట్, అందానికి అందం, టాలెంట్ కి టాలెంట్ అన్ని ఉన్నాయి. లక్కు కూడా కాస్త ఎక్కువే. లేదంటే గుంటూరు కారం తర్వాత శ్రీలీల కి ఆఫర్స్ వస్తున్నాయంటే ఆమెకి ఆవగింజంత అదృష్టం ఉంది అనే చెప్పాలి.
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఎప్పటికప్పుడు తన కొత్త కొత్త ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీలీల నిన్న శారీ లో ఉన్న బ్యూటీఫుల్ లుక్ తో మెస్మరైజ్ చేసిన పిక్స్ వదిలితే.. ఈరోజు మోడ్రెన్ డ్రెస్ లో క్యూట్ అండ్ స్వీట్ గా ఉన్న పిక్స్ వదిలింది. శ్రీలీల ఆ రెండు ఫోటోస్ లో చాలా అందంగా కనిపించింది.
ఆ ఫోటో ని చూడగానే శ్రీలీల నిన్ను ఇలా చూస్తే పడని వారుండరు, ఏ హీరో అయినా పిలిచి ఆఫర్ ఇవ్వాల్సిందే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.