సమంత నాగ చైతన్య తో విడిపోయి విడాకులు అయ్యాక ఆమె ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలోనే కనిపించింది. గుడులు గోపురాలు తిరుగుతూ, సద్గురు ఆశ్రమంలో ధ్యానం చేస్తూ మధ్య మధ్యలో ఫ్రెండ్స్ తో చిల్ అయిన సమంత ఆ తర్వాత మాయోసైటిస్ అనే వ్యాధితో బాగా ఇబ్బంది పడింది. ఆ వ్యాధి కారణంగా కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అలాగే తనపై వచ్చిన ట్రోల్స్ ని కూడా తట్టుకుని నిలబడింది.
మాయోసైటిస్ నుంచి కోలుకుంటూనే తనలా ఎవరూ బాధకూడదు అంటూ తాను తీసుకున్న ట్రీట్మెంట్ ని పాడ్ కాస్ట్ ద్వారా తన అభిమానులకి చేరవేస్తుంది. హెల్త్ టిప్స్ చెబుతుంది. ఈమధ్యన కెరీర్ లో మళ్ళీ బిజీ అయ్యేందుకు గ్లామర్ ఫొటో షూట్స్ తో రెచ్చిపోతుంది. తాజాగా సమంత గత మూడేళ్ళుగా తనలోకి శక్తి, బలం ఎలా వచ్చాయో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
లైఫ్ లో అన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు. కానీ మనలోని విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ నమ్మకమే మనకు ప్రశాంతతని, బలాన్ని ఇస్తుంది. గత మూడేళ్లు నాకు కష్టమైనా.. ఇప్పుడు మాత్రం నేను బలంగా మారాను. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. అంత బలం నాకు ఆధ్యాత్మికత చింతన ద్వారానే వచ్చింది.
ఆధ్యాత్మికత అనేది నా లైఫ్ లోని చాలా విషయాలను ప్రభావితం చేస్తుంది. సంఘర్షణలు, అవగాహనలు నాకు నేర్పినవి. ఆధ్మాత్మికత నాకు అవసరమైన బలంగా మారింది. అందుకే నేను ఆధ్యాత్మికత ని బలంగా నమ్ముతాను అంటూ సమంత చెప్పుకొచ్చింది.