ఈమధ్యన బిగ్ బి అమితాబచ్చన్ టాలీవుడ్ హీరోల సినిమాల్లో అదిరిపోయే కేరెక్టర్స్ తో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైపోయారు. గతంలో నాగ్ మనం చిత్రంలో జస్ట్ గెస్ట్ రోల్ లో మెరిసిన అమితాబ్.. ఆతర్వాత మెగాస్టార్ చిరు సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. ఇప్పుడు కల్కి చిత్రంలో అశ్వద్ధామ గా పాన్ ఇండియా ప్రేక్షకుల నుండి ప్రశంశలు అందుకున్నారు.
అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ కూడా నటుడే అయినప్పటికీ. ఆయన కేరీర్లో బ్రేకిచ్చే ఒక్క చిత్రమూ లేదు. దానితో అభిషేక్ బచ్చన్ యావరేజ్ నటుడిగానే మిగిలిపోయాడు. నటన కన్నా బిజినెస్ వ్యాహారాల్లో ఎక్కువ ఉండే అభిషేక్ బచ్చన్ అవకాశం వచ్చినప్పుడలా నటుడిగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై కూడా లక్కుని పరిక్షించుకున్నాడు.
తాజాగా అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ అప్ కమింగ్ మూవీ లో చోటు దక్కించుకున్నట్లుగా టాక్. షారుఖ్ కింగ్ మూవీలో అభిషేక్ నెగెటివ్ కేరెక్టర్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. సుజయ్ ఘోష్ దర్శత్వంలో షారుఖ్ ఆయన కుమార్తె సుహానా ఖాన్ కాంబోలో రాబోతున్న ఈ మూవీలో అభిషేక్ విలన్ రోల్ లో కనిపించనున్నాడని బాలీవుడ్ మీడియా టాక్.