రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ డ్రగ్స్ కేసులో ప్రస్తుతం తెలంగాణ పోలీసులు చేతికి చిక్కాడు. తెలంగాణాని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చెయ్యాలని కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి.. డ్రగ్స్ సరఫరా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. హైదరాబాద్ లో పలు రెస్టారెంట్స్, పబ్స్ పై తరచూ దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగా నిన్న సోమవారం రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు.
డ్రగ్స్ ప్లేడ్లర్స్ ఇచ్చిన సమాచారంతో అమన్ ప్రీత్ ని అరెస్ట్ చేసి ఈ కేసులో A 14గా చేర్చారు. అది హాట్ టాపిక్ గ ఉన్న సమయంలో అమన్ ప్రీత్ అక్క రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ తో కలిసి డిజైనర్ వేర్ అవుట్ ఫిట్స్ లో సరదాగా చేయించుకున్న వీడియో ని షేర్ చెయ్యగా అది వైరల్ గా మారింది. భర్త తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ వైట్ కాస్ట్యూమ్స్ లో భర్త తో కలిసి అనంత్ అంబానీ వెడ్డింగ్ రిసెప్షన్ కి రెడీ అవుతున్న ఫోటో షూట్స్, అలాగే వీడియో ని షేర్ చేసింది.
రకుల్ ఆమె భర్త తో నవ్వుతున్న వీడియో, ఇంకా ఫొటోస్ చూడగానే తమ్ముడు అరెస్ట్ అయ్యాడు అక్క ఏమిటి అదేమి పట్టించుకోకుండా ఇలా ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అమన్ ప్రీత్ పోలీసులు అదుపులో ఉన్నాడు.