బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీలోకి రావడానికి బోలెడంత టైమ్ తీసుకున్న శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ సౌత్ లోకి ఎంటర్ అవడమే చెలరేగిపోతుంది. సోషల్ మీడియాలో గ్లామర్ చూపిస్తూ అద్దరగొట్టే జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ లో ఆఫర్స్ తో చితక్కొట్టేస్తుంది. వరస ఆఫర్స్ తో లక్కీ భామగా టర్న్ అయ్యింది.
ఎన్టీఆర్ తో ఒప్పుకున్న దేవర మూవీ విడుదలైతే కానీ పాప లక్కీనా కాదా అనేది తెలుస్తుంది. కానీ ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు ఈలోపు మరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిలిచి RC16 లో ఆఫర్స్ అందించాడు. ఆ సినిమా షూటింగ్ మొదలు పెట్టకుండానే మరో హీరో జాన్వీ కపూర్ కి ఛాన్స్ ఇవ్వబోతున్నాడని కాదు.. ఈ అందాల తారని తన సినిమాలోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట.
ఆయనెవరో కాదు నేచురల్ స్టార్ నాని. నాని రెండేళ్ల క్రితం శ్రీకాంత్ ఓదెల తో దసరా అనే కల్ట్ మూవీ చేసి 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు వీరి కాంబోలో మరో మూవీ దసరాకి సీక్వెల్ రాబోతుంది. ఆ చిత్రంలోనే హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకోవాలని చర్చలు జరుపుతున్నారట.
వరసగా సౌత్ స్టార్స్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని మరి ఇలా వరసగా జాన్వీ కపూర్ కి ఆఫర్స్ ఇస్తుంటే.. ఆమె ఇకపై ఏ హీరోని వదిలేలా కనిపించడం లేదు అంటున్నారు.