‘మురారి’ వద్దు.. ‘అతడు’ వెయ్.. ఇది మేము చెబుతున్న మాట కాదండోయ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు డై-హార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెబుతున్నమాట.. అదే చేస్తున్న ట్వీట్. రాబోయే మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్‌గా ‘మురారి’ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు మహేష్ ఫ్యాన్స్‌లోని కొందరు ప్లాన్ చేశారు. అందుకు తగినట్లుగా అన్ని కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నారు. అయితే ‘మురారి’ కాకుండా ‘అతడు’ అయితే బెటర్ అంటూ సోషల్ మీడియాలో మహేష్ బాబు డై-హార్డ్ ఫ్యాన్స్ కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్స్‌తో మురారితో పాటు అతడు ట్యాగ్ కూడా టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
ఖలేజా ఏదో ఇష్యూ అన్నారు కదా.. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అతిథి, అతడు ఇవన్నీ వదిలేసి మురారి ఏంటయ్యా. రీ రిలీజ్‌కు కావాల్సింది మాస్ మూవీస్ మరియు ఫ్యాన్ స్టఫ్ ఉండే మూవీస్.. క్లాసిక్స్ కాదు... అని ఓ మహేష్ బాబు ఫ్యాన్ ట్వీట్ చేస్తే, మరో అభిమాని.. ఒక అతడు, ఒక ఖలేజా, ఒక అతిథి, ఒక దూకుడు, ఒక సరిలేరు నీకెవ్వరు.. ఇన్ని ఆప్షన్స్ పెట్టుకుని మురారికి వెళ్లారు ఏంటీ అని ప్రశ్నించారు.. ఇలా నెటిజన్ల వరసగా మురారిపై అనాసక్తి కనబరుస్తూ ట్వీట్స్ వేస్తున్నారు. కొందరేమో.. ఇలాంటి వాళ్లే ఫస్ట్ టికెట్ బుక్ చేసుకుంటారు అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా అయితే మురారి4k ట్యాగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
మురారి విషయానికి వస్తే.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్‌లో ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలబడింది. ముఖ్యంగా మహేష్ బాబులోని నటనను వెలికి తీసిన చిత్రంగా మురారికి పేరుంది. సోనాలిబింద్రే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో భారీ తారాగణం నటించారు. ఇందులోని ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యంగా ఇప్పటికీ వినబడుతూనే ఉంటుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పుడీ సినిమా మహేష్ బాబు బర్త్‌డే స్పెషల్‌గా 4కె వెర్షన్‌లో రీ రిలీజ్ చేయబోతున్నారు.