బింబిసార, భీమ్లా నాయక్, సార్.. వంటి హిట్ చిత్రాలలో నటించి సక్సెస్‌పుల్ హీరోయిన్‌గా పేరొందిన నటి సంయుక్త. ఈ భామ పేరు ఈ మధ్య బాగా వైరల్ అవుతోంది. సంయుక్త ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాకు వదులుతూ.. సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. ఆ ఫొటోలతో ఆమె పేరు కూడా బాగా ట్రెండ్ అవుతోంది. ఆమె అవ్వడానికి మలయాళీ అయినప్పటికీ.. టాలీవుడ్, కోలీవుడ్‌లో బిజీ తారగా ఇప్పుడు దూసుకెళుతోంది. అంతేకాదు, ఆమెకిప్పుడు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘మహారాగ్ని: క్వీన్ అఫ్ క్వీన్స్’ అనే మూవీలో చేస్తూ.. బాలీవుడ్ అరంగేట్రానికి కూడా సిద్ధమైంది. మరి హిందీలో అదే బాలీవుడ్‌లో ఇంకా ఇంకా ఫేమస్ అవ్వాలని చేస్తుందో.. లేదంటే నా అందాల పవర్ ఇదని చూపిస్తుందో తెలియదు కానీ.. ఆమె షేర్ చేసే ఫొటోషూట్ ఫొటోలు ఒకదానిని మించి ఒకటి ఉండటం విశేషం. ఆ ఫొటోలు చూసిన వారంతా తన గ్లామర్ గురించి మాట్లాడుకోవడంతో.. ఈ అమ్మడుపై బాలీవుడ్ కన్ను బాగానే పడినట్లుగా టాక్ వినబడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమెకు మరో ఆఫర్ వచ్చినట్లుగా టాక్ వినబడుతోంది.
ఇక విషయంలోకి వస్తే.. తాజాగా సంయుక్త షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. రోజ్ కలర్ శారీ, డిజైనర్ బ్లౌజ్ ధరించి సంయుక్త ఇచ్చిన ఫోజులు కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. తన గ్లామర్ పదును ఇదని మరోసారి ఈ ఫొటోలతో సంయుక్త తెలియజెప్పింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో నిఖిల్ సరసన స్వయంభూ చిత్రంలో ఆమె నటిస్తోంది.