Advertisementt

హరోంహర ఓటీటీలో ఈ రోజు నుంచే!

Mon 15th Jul 2024 11:14 PM
harom hara ott aha  హరోంహర ఓటీటీలో ఈ రోజు నుంచే!
Harom Hara Official OTT Release Details హరోంహర ఓటీటీలో ఈ రోజు నుంచే!
Advertisement
Ads by CJ

సుధీర్ బాబు హీరోగా నటించిన హరోంహర ఓటీటీ విడుదల విషయంలో కాస్త కన్ఫ్యూజ్ నెలకొంది. ఎందుకంటే, ఆహా ఓటీటీ సంస్థ ఈ సినిమాను జూలై 11 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకువస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ డేట్‌కే ప్రసారం కూడా చేసింది.. కానీ వెంటనే మళ్లీ ఆపేసి.. జూలై 19న స్ట్రీమింగ్ అనేలా ఓ వార్త బయటికి వచ్చింది. దీనికి కారణం ఏంటనేది తెలియదు కానీ.. ఒకసారి విడుదల చేసి, ఆపేసి.. మళ్లీ రిలీజ్ చేయడం మాత్రం హరోంహర చిత్రానికే జరుగుతోంది. అంతకుముందు రానా నాయుడు వెబ్ సిరీస్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. అయితే ఆ సిరీస్‌పై వీక్షకులు సీరియస్ అవడంతో అలా జరిగింది. మరి హరోంహర ప్రాబ్లమ్ ఏమిటో తెలియదు కానీ.. మళ్లీ ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. 

ప్రస్తుతం వినిపిస్తున్న జూలై 19న కాకుండా ఈరోజే.. అంటే జూలై 15 సాయంత్రం 5 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని.. మండే మూవీ అంటూ ఆహా ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆల్రెడీ వచ్చిన ఈ సినిమాను అలా ఆపేయడానికి కారణం.. ప్రింట్ విషయమే అనేలా.. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో 4కె వెర్షన్ అని ప్రత్యేకంగా ప్రకటించడం విశేషం. ఏదయితేనేం.. కాస్త కన్ఫ్యూజ్ నెలకొన్నప్పటికీ.. దానిని మరింత పెద్దది చేయకుండా.. ఎర్లీగానే సాల్వ్ చేసి.. మళ్లీ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకొస్తుంది ఆహా.

హరోంహర విషయానికి వస్తే.. జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ రెస్పాన్స్‌ని అందుకున్నప్పటికీ.. కంటెంట్ పరంగా మాత్రం మంచి మార్కులే వేయించుకుంది. ముఖ్యంగా సుధీర్ బాబు నటన హైలెట్ అనేలా టాక్ వినబడింది. మరిప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి.

Harom Hara Official OTT Release Details:

Harom Hara Streaming Date and Time Out

Tags:   HAROM HARA OTT AHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ