Advertisementt

కట్ చేస్తే హిట్ అవుతుందా?

Mon 15th Jul 2024 11:03 PM
bharateeyudu 2 trimmed  కట్ చేస్తే హిట్ అవుతుందా?
Bharateeyudu 2 trimmed drastically కట్ చేస్తే హిట్ అవుతుందా?
Advertisement
Ads by CJ

ఈ మధ్యకాలంలో కాస్త తగ్గింది కానీ.. ఇంతకు ముందు కొన్ని సినిమాలను ఎక్కువ నిడివితో రిలీజ్ చేయడం.. ప్రేక్షకుల స్పందన చూసిన తర్వాత నిడివిని కట్ చేయడం వంటిది రెగ్యులర్‌గా జరుగుతుండేది. ఇప్పుడో బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సినిమా కూడా అదే పరిస్థితిని ఫేస్ చేస్తోంది. ఆ సినిమా మరేదో కాదు.. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన భారతీయుడు 2 చిత్రం. 

సెన్సేషనల్ కాంబినేషన్, బ్లాక్‌బస్టర్ చిత్రానికి సీక్వెల్, భారీతనానికి నిలువెత్తు నిదర్శనం అయిన నిర్మాణ సంస్థ నిర్మించిన ‘భారతీయుడు 2’ చిత్రం మొదటి రోజు మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో చూడాలనుకున్న వారు కూడా వెనక్కి తగ్గడంతో.. భారీగా కలెక్షన్స్ పడిపోయాయి. దీంతో మేకర్స్ ప్రక్షాళనకు దిగారు. అదేనండి, కటింగ్ చేసే పనిని కల్పించుకున్నారు. భారతీయుడు 2 సినిమా 3 గంటల 4 సెకన్ల నిడివితో విడుదలైంది.

ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌లో నిడివి మెయిన్ సమస్యగా గుర్తించిన మేకర్స్ ఇప్పుడీ సినిమాలోని 20 నిమిషాల అనవసరపు సన్నివేశాలను తొలగించి, 2 గంటల 40 నిమిషాల నిడివికి తగ్గించారు. అయినా కూడా ఈ సినిమాపై ప్రేక్షకులకు ఇంట్రస్ట్ కలగకపోవడం చూసిన వారంతా.. కట్ చేస్తే హిట్ అవుతుందా? అనేలా కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన రెండు పాటలు కూడా ఈ సినిమాలో లేవు. అయినా కూడా 3 గంటల సినిమాను మేకర్స్ విడుదల చేశారు. మూడో పార్ట్ ఉందని తెలిసి కూడా.. ఇంత నిడివితో మేకర్స్ విడుదల చేయడం వారి కాన్ఫిడెంట్‌ని తెలియజేసినా.. కంటెంట్ ప్రధానమనే విషయాన్ని మేకర్స్ గమనించకపోవడంతో.. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఓ సాదాసీదా సినిమాగా బాక్సాఫీస్ వద్ద రికార్డులలోకి ఎక్కింది.

Bharateeyudu 2 trimmed drastically:

Bharateeyudu 2 undergoes scissors cut

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ