మలయాళ సినీ చరిత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ది గోట్ లైఫ్ (ఆడుజీవితం). పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది. అయితే మార్చిలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇంకా ఓటీటీలోకి రాకపోవడంతో.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందా? అని ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ నెట్‌ఫ్లిక్స్ సంస్థ శుభవార్త చెప్పింది. జూలై 19 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకురాబోతున్నట్లుగా నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
వాస్తవానికి ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వాళ్లు మే 26 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఇంతకు ముందు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఆ తేదీకి సదురు ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రాలేదు. అంతే, అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనేది క్లారిటీ రాలేదు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ క్లారిటీ ఇవ్వడంతో.. ఈ సినిమాను చూసేందుకు ఓటీటీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
90వ దశకంలో జీవనోపాధి కోసం కేరళ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లిన బెన్యామిన్ నజీబ్‌కు అక్కడ ఎటువంటి కష్టాలు ఎదురయ్యాయి? ఆ కష్టాల నుంచి అతను ఎలా బయటపడ్డాడనే రియల్ లైఫ్ ఘటనలతో వచ్చిన బుక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా మంచి ఆదరణను పొందే అవకాశం ఉంది.