Advertisementt

ఫౌజీగా ప్రభాస్?

Mon 15th Jul 2024 09:38 AM
prabhas fauji  ఫౌజీగా ప్రభాస్?
Prabhas and Hanu Raghavapudi Movie Title ఫౌజీగా ప్రభాస్?
Advertisement
Ads by CJ

కల్కి 2898 ADతో రూ.1000 కోట్ల క్లబ్బులో సరదాగా అడుగుపెట్టిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. బాహుబలితో తనకొచ్చిన క్రేజ్‌ని ఇంకా ఇంకా క్యాష్ చేసుకుంటూనే ఉన్నాడు. నార్త్ ఆడియన్స్ బాహుబలి తర్వాత ప్రభాస్‌ని గుండెల్లో పెట్టేసుకున్నారు. ఆయన నుంచి నిరాశపరిచే సినిమాలొచ్చినా నార్త్ నుంచి మంచి ఓపెనింగ్స్ కట్టబెడుతున్నారు. 

నార్త్ స్టార్ హీరోలని కూడా తలదన్నే రీతిలో బాలీవుడ్ బాక్సాఫీసుని ప్రభాస్ వణికిస్తున్నాడు. ఇక బాహుబలి, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కిగా పాన్ ఇండియా ప్రేక్షకులని పడేసిన ప్రభాస్.. ఇకపై రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ చిత్రాలతోనే కాకుండా సీతారామం దర్శకుడు హను రాఘవపూడితో మరో మూవీ ఓకే చేసేశాడు. 

సెప్టెంబర్‌లో హను-ప్రభాస్ కాంబో మూవీ సెట్స్ మీదికి వెళ్లే అవకాశం ఉండగా.. ఇప్పుడు ఈ చిత్రానికి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1947 కంటే ముందు సాగే క‌థగా ఇందులో ప్ర‌భాస్ బ్రిటీష్ సైన్యంలో ఓ సోల్జ‌ర్‌గా కనిపిస్తారని.. అందుకే ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట మేకర్స్. 

ఇందులోనూ ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుందని.. హీరోయిన్‌గా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్‌నే ప్రభాస్‌కి జోడిగా ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. టాక్ మాత్రమే.. అసలు మ్యాటర్ ఏంటనేది అధికారిక ప్రకటన వస్తేగానీ తెలియదు.. అప్పటి వరకు ఇలాంటి వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి మరి.

Prabhas and Hanu Raghavapudi Movie Title:

Prabhas Turns Fauji for Hanu Raghavapudi

Tags:   PRABHAS FAUJI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ