అవును.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఊహించని వివాదంలో ఇరుక్కున్నారు..! అసలు ఆయన ప్రమేయం ఉందో లేదో తెలియదు కానీ గత 24 గంటలుగా మీడియా, సోషల్ మీడియాలో ఈ పేరు మాత్రం మారుమోగుతోంది..! వాస్తవానికి విజయసాయిపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ అవన్నీ ఒక లెక్క.. ఇప్పుడీ వివాదం, ఆరోపణలు మాత్రం ఓ లెక్క..! ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మానం, ప్రాణంతో కూడినది కావడంతో ఏపీలో బర్నింగ్ టాపిక్ అయ్యింది..! ఇంతకీ ఏమిటా వివాదం..? అందులో ఆయన ప్రమేయం ఎంత..? ఈ ఆరోపణల్లో నిజానిజాలు ఎంత..? అనేది తెలుసుకుందాం వచ్చేయండి మరి..!
అసలేం జరిగింది..?
నా భార్య గర్భానికి.. బిడ్డ పుట్టకకు కర్త, కర్మ, క్రియ విజయసాయి రెడ్డే కారణమని ఒక మహిళ భర్త సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో మొత్తం బయటికి వచ్చింది. అది కూడా ఆ మహిళ సాధారణ వ్యక్తి అయితే బహుశా ఎవరూ నమ్మరు.. పెద్దగా పట్టించుకునే వారు కాదేమో కానీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పదవిలో ఉన్న మహిళ. వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన శాంతి కావడంతో ఈ వ్యవహారం సెన్సేషన్ అయ్యింది. ఈమె వైసీపీ పెద్దలకు ఎంతో నమ్మకమైన అధికారిణి.. ఎంతమంది అధికారులు ఉన్నప్పటికీ శాంతిని మాత్రం పట్టుబట్టి మరీ ఎన్టీఆర్ జిల్లాలో పోస్టింగ్ ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం రాగానే సస్పెన్షన్ వేటు పడటంతో ఇంటికే పరిమితం అయ్యారు అవన్నీ ఇక అప్రస్తుతం.
మొత్తం వాళ్ళే చేశారు..?
ఇక అవన్నీ పక్కన పెడితే.. శాంతి భర్త మదన్ మోహన్ పీహెచ్‌డీ కోసం అమెరికా వెళ్లి గత ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అక్కడే ఉన్నారు. ఐతే స్వదేశానికి వచ్చే సరికి దారుణమైన విషయం వెలుగు చూసింది. నా భార్య గతేడాది జులైలో గర్భం దాల్చిందని.. మెడికల్ రిపోర్టుల ద్వారా తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో బాబుకు జన్మనిచ్చిందని.. ఈ బాబుకు తండ్రి ఎవరని ప్రశ్నించగా తొలుత తానేనని బుకాయించింది.. ఆ తర్వాత ఐవీఎఫ్‌కు వెళ్లినట్టు చెప్పిందని, ఇంకోసారి ఎంపీ విజయసాయి రెడ్డి పేరు చెప్పిందని, ఆ తర్వాత మరో పేరు చెప్పిందని మధుసూదన్ ఫిర్యాదులో చెప్పడం నివ్వెరపోయే విషయం. నా భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నాడు మధు. 2015లో ఇద్దరు ఆడ కవల పిల్లలు జన్మించారని కూడా వివరించాడు.
విషమ పరీక్షే..!
పవిత్రమైన దేవాదాయ శాఖలో ఇలాంటివి జరగడం ఏంటో..! మధు.. శాంతిల వ్యవహారంలో ఏం జరిగిందో పైనున్న పెరుమాల్లకే తెలియాలి. కొన్ని గంటలుగా ఇంత జరుగుతున్నప్పటికీ విజయసాయి మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం. వైసీపీలో పెద్ద మనిషిగా ఉంటూ.. ఈ లేటు వయసులో ఇలాంటి ఆరోపణలు రావడం చాలా ఇబ్బందే.. అంతకుమించి ఊహించని వివాదమే ఇది అని చెప్పుకోవచ్చు. మరోవైపు.. అటు సదరు అధికారిణి కూడా ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ వ్యవహారం ఇంకా ఎంత వరకు వెళ్తుందో ఏంటో మరి.