Advertisementt

ఆగష్టు నుంచి RC16

Sat 13th Jul 2024 09:51 PM
rc16  ఆగష్టు నుంచి RC16
RC16 from August ఆగష్టు నుంచి RC16
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-బుచ్చి బాబు కలయికలో పూజా కార్యక్రమాలతో మొదలైన RC16 రెగ్యులర్ షూట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మెగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మూడేళ్ళుగా రామ్ చరణ్ గేమ్ చేంజర్  కి సమయాన్ని ఇచ్చేసారు. ఇప్పుడు ఆయన కొత్త ప్రాజెక్ట్ మీదకి వెళ్లే సమయం ఆసన్నమైంది. 

చరణ్ గేమ్ చెంజర్ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో రామ్ చరణ్ ఇమ్మిడియట్ గా RC16 సెట్స్ లోకి వెళ్ళిపోతారని అనుకున్నాను. కానీ చరణ్ చిన్నపాటి బ్రేక్ తీసుకుని ఆ తర్వాతే RC16 సెట్స్ మీదకి వెళ్లాలనుకుంటున్నారని ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ భార్య ఉపాసనతో సహా ముంబై లో ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో పాలుపంచుకుంటున్నారు. 

అయితే తాజాగా RC16 రెగ్యులర్ షూటింగ్ ని బుచ్చిబాబు ఆగష్టు నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నారని.. రామ్ చరణ్ అప్పటికల్లా సెట్స్ మీదకి వస్తాను అని చెప్పినట్లుగా టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో బుచ్చిబాబు బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో చరణ్ కి విలన్ గా కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటిస్తుండగా.. హీరోయిన్ గా జాన్వీ కపూర్ కనిపించబోతుంది.  

RC16 from August:

RC16 regular shoot from August

Tags:   RC16
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ